27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

నేటితో ముగుస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

(తెలంగాణ సామ్నా డెస్క్)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘ ఎన్నికలకు గాను ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్లాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపి, బీఆరఎస్‌లు తమ ప్రచారంలో తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం కంటే కూడా ఇతర పార్టీలను తీవ్రంగా విమర్శించడానికి, నాయకులను వ్యక్తిగతంగా దూషించడానికే తమ శక్తియుక్తులను ఉపయోగించినట్లు కనబడింది. ఒకపార్టీ ఇంకొక పార్టీతో రహస్య ఒప్పందం వుందనే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్పారు.
వివిధ పార్టీల అభ్యర్థులే కాకుండా స్వతంత్య్ర అభ్యర్థులు కూడా తమ శక్తిమేరకు ప్రచారాన్ని చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు నిర్దారించిన వ్యయం కాగితాలకే పరిమితం అయినట్లు తెలుస్తున్నది. అభ్యర్థుల ఖర్చులు కొందరికి 50 లక్షలకు మించి అయినట్లు సమాచారం. కార్పోరేషన్ స్థాయి ప్రతిష్ఠాత్మకమైన పోటీలో కొందరు అభ్యర్థుల ఖర్చు కోటి దాటినట్లు సమాచారం అందుతోంది.
ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల వారు ఉత్సాహంగా పాల్గోన్నా, ముఖ్యంగా మహిళలు ప్రచారంలో తప్పనిసరి అని చాలామంది అభ్యర్థులు మహిళలను ఇంటింటి ప్రచారానికి పంపారు.
ప్రధానఘట్టమైన ఎన్నికలు 11వ తేదీ సాయంత్రం వరకు కూడా ఓటర్లను ఎదో ఒక విధంగా ప్రలోభపెట్టే కార్యక్రమాలు జరుగుతాయన్న వాదన వస్తున్నది. కొందరు ఓటర్లు కావాలనే సాయంత్రం వరకు ఓటు వేయకుండా అభ్యర్థుల తాయిలాల కోసం ఎదురు చూస్తూ వుంటారనే వాదన వినిపిస్తున్నది.
ఇంతవరకు జరిగిన ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి తీవ్రమైన సంఘటనలు జరగలేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు గొడవలకు దిగే అవకాశం కనిపించినా పోలీసుల చర్యల వల్ల సాధ్యం కాలేదని తెలుస్తున్నది.
శుక్రవారం మధ్యాహ్ననికి అభ్యర్థుల భవితవ్యం తేలిపోనున్న నేపథ్యంలో అందరు అభ్యర్థులు భయంభయంగా, ఉత్సాహంగా రాజకీయ రచనలు చేస్తున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles