(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలోని 13వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్‌తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, 14వ వార్డు కౌన్సిలర్ రెంజర్ల కళ్యాణి, యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు ఎలేటి మహిపాల్ రెడ్డి, నాయకులు నజ్జు, ఏఆర్ అక్బర్, చిట్మెల్లి రంజిత్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
