
(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న గోమాత కళేబరాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో నాయకులు మాట్లాడారు.
గురువారం బక్రీద్ పండుగ రోజున జాతీయ రహదారిపై లక్ష్మీనారాయణ స్వామి ఆలయం సమీపంలో గోమాత కళేబరాలు పడవేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. శాంతియుత వాతావరణం ఉన్న కోరుట్ల పట్టణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో కొందరు హిందూ వ్యతిరేక శక్తులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తిరుమల వాసు, జిల్లా నాయకుడు సుదవేని మహేష్, బీజేవైఎం నాయకుడు కళల సాయిచంద్, మైనార్టీ నాయకుడు ఎంఎస్ అక్మల్ మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించి వెంటనే శిక్షించాలని కోరారు. అలాగే ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు స్పందించినప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు.
పత్రికా సమావేశం అనంతరం నాయకులు కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ కి లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, మ్యాకాల గణేష్, మడవేని నరేష్, తులసి కృష్ణ, గిన్నెల శ్రీకాంత్, బెక్కం అశోక్, మైదం సత్యనారాయణ, రాధారపు సత్యనారాయణ, ఉప్పులోటి రాఘవులు, ఓం ప్రకాష్, తల్లపెల్లి శ్రీనివాస్, మామిడి మల్లేశ్ రెడ్డి, ధమ్మా సంతోష్, కముటం శ్రీను, తైదల ప్రశాంత్, చిట్యాల రాజేందర్, దామ శ్రవణ్, నారవేని విజయ్, బాల్క ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
