
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ చౌరస్తా తో పాటుగా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన రెండు కార్నర్ మీటింగ్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అభివృద్ధి నిధులు పట్టణాలు, గ్రామాల స్థాయి వరకు పూర్తిగా చేరాలంటే ప్రతి గల్లీలో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీల అమలులో విఫలమైందని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. ఈ పాలకుల నిర్లక్ష్యానికి కారణం మోసపోయి ఓటు వేసిన ప్రజలే కారణమని అన్నారు.
ఇంకా ఎంతకాలం ప్రజలు ఇలా మోసపోవాలని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికైనా నిజాలను గుర్తించి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ పదవి బీజేపీ కైవసం అయితేనే పట్టణానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
