కథలాపూర్, జూన్ 1: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ నాగం భూమయ్య ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సోమవారం జగిత్యాల ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఐతే ప్రజావాణిలో అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, కలిసి ప్రజావాణి హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు చేసేంతవరకు ఉద్యమం చేస్తామని గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగం భూమయ్య, ఉప సర్పంచ్ పోకతోట లింబాద్రి,… వార్డు సభ్యులు ఉన్నారు.
