(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణంలో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బీహార్ రాష్ట్రానికి చెందిన మాలిక్ కుమార్ (28), తండ్రి రామ్ విలాస్ పాస్వన్, కగారియా జిల్లా బోరునే గ్రామ నివాసి. అతను గత కొద్ది రోజులుగా కోరుట్లలోని ఓ రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ, అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గంజాయి తీసుకువచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది.
ఈ సమాచారం మేరకు అప్రమత్తమైన కోరుట్ల పోలీసులు మంగళవారం రోజు కాలేజీ గ్రౌండ్‌లోని పార్కు వద్ద దాడి నిర్వహించారు. అక్కడ గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న మాలిక్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి సుమారు 100 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కోరుట్ల ఎస్ఐ చిరంజీవి తెలిపారు. పట్టణంలో అక్రమ మాదకద్రవ్యాల విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో కోరుట్లలో మాదకద్రవ్యాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
