
(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల పట్టణానికి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణను మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సై గా కొనసాగుతున్న చిరంజీవిని స్థానిక ప్రజాప్రతినిధులు గూగులవత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ మరియు తిరుమల వాసు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా 7వ వార్డు అర్బన్ కాలనీ మరియు పరిసర ఔట్‌సైడ్ ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యలను వార్డు కౌన్సిలర్ గూగులవత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతున్న అక్రమ బెల్ట్ షాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన సీఐ కే. లక్ష్మీనారాయణ, ఎస్సై ఎమ్. చిరంజీవి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.
