
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో శుక్రవారం రోజున సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సాగునీటి, ఆరోగ్య, విద్య, రోడ్లు–మౌలిక వసతుల రంగాల్లో పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గంగనాల ప్రాజెక్ట్ ద్వారా సుమారు 8,000 ఎకరాలకు సాగునీటి లబ్ధి, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, విద్యా సంస్థల భవనాల పూర్తి, రోడ్లు–బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన వినతులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ తెలిపారు.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం. సంప్రదించండి: “బాలె అజయ్” – 9290277727)
