37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్లలో సీఎం కప్ పోటీలకు టార్చ్ ర్యాలీ ప్రారంభం

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

కోరుట్ల మండలంలోని జిల్లా పరిషత్ కోరుట్ల పాఠశాలలో ఈరోజు సీఎం కప్ 2025–26 క్రీడా పోటీలను పురస్కరించుకొని టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ నెల 17వ తేదీ నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖాధికారి డాక్టర్ కోరుకంటి విజయకుమార్ మాట్లాడుతూ, ఈ పోటీల్లో యువకులు, విద్యార్థినీ-విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రామచంద్రం, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఈఓ గంగుల నరేశం, జిల్లా పెటా ప్రెసిడెంట్ విశ్వప్రసాద్, సెక్రటరీ అశోక్, డీవైఎస్‌ఓ కె.రవికుమార్, ప్రధానోపాధ్యాయులు వి.గంగాధర్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ చక్రధర్, పీడీ విజయ్ కుమార్, రాజు, అశోక్, సంజీవ్, రాజేష్, సీఆర్‌పీ పి.గంగాధర్‌తో పాటు సీనియర్ క్రీడాకారులు సాయి, రాజేష్, నీలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం. సంప్రదించండి: “బాలె అజయ్” – 9290277727)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles