(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి.
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోరుట్ల పట్టణ 22వ వార్డుకు చెందిన టేకుల నరేష్ సహా సుమారు 70 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నూతనంగా పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం. సంప్రదించండి “బాలె అజయ్” – 9290277727)

