
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా మెట్‌పల్లి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘును నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమండ్ల మహేష్ బుధవారం తెలిపారు.
వెయిట్ లిఫ్టింగ్ క్రీడ అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం, అలాగే జిల్లాలో యువ క్రీడాకారులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు డాక్టర్ రఘు సూచనలు, సలహాలను అమలు చేస్తామని తెలిపారు.
ఈ నియామకంపై అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. నూతన గౌరవ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ రఘు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు
