
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన మారంపెల్లి లక్ష్మి తీవ్ర బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు, ఎన్ఆర్ఐ, సామాజిక సేవకులు నిమిషకవి నవీన్ బుధవారం ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
వైద్య ఖర్చుల కోసం కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గమనించిన నిమిషకవి నవీన్ రూ.12,000 నగదు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మారంపెల్లి ప్రణయ్, గన్నాజీ శివ, వెంకటరెడ్డి రాజు, రాజోజి గోపి, చిలివేరి రవి, బొల్లపెల్లి అరుణ్, లింగంపెల్లి రఘు, మరుపాక రిషి తదితరులు పాల్గొన్నారు.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం. వివరాలకు సంప్రదించండి “బాలె అజయ్” – 9290277727)
