సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన దూస రాజేశం అతని భార్య లక్ష్మి బలంగా ముఖంపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత రాజేశం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో ఈ సంఘటనలు జరిగినట్టుగా తెలుస్తున్నది. వారి కుమారుడు వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
