27.2 C
Hyderabad
Monday, September 14, 2026
No menu items!

మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా కోరుట్లలో బీఆర్ఎస్ ధర్నా

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన.., పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో ధర్నా నిర్వహించారు.

పట్టణంలోని బస్‌స్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.
ముందుగా బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులతో నిరసనకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, వారిని లాగడం, తోసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపించారు.

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అనుచితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణచివేసే విధంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నేతలకు, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం కల్పించాలని వారు అన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles