
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, ట్రబుల్ మంగర్స్‌కు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కోరుట్ల సీఐ కే. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, ఊరేగింపులు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా వ్యవహరించాలని తెలిపారు.
గొడవలు, నేరాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో కోరుట్ల సీఐ కే. లక్ష్మీనారాయణ, ఎస్ఐ జి. శ్యామ్ రాజ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
