
(బాలే అజయ్ 9290277727 కోరుట్ల)
అనారోగ్య కారణాలతో కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇర్నాల రాజేష్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య భాగ్య, నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. భాగ్య కూలి పనికి వెళ్తుంది.
కుటుంబం.సజావుగా సంసారం సాగుతోంది. ఐతే సోమవారం రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అనారోగ్య కారణాలతో రాజేష్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని బంధువులు తెలిపారు. పూర్తి వివరాలు పోలీసులు తెలపాల్సి వుంది.
