27.3 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వోడ్నాల రామారావు ఎంపిక

(బాలే అజయ్ – 9290277727)

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సోమవారం నిర్వహించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అవగాహన సదస్సులో జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా వోడ్నాల రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన సెల్ నెంబర్: 9505217999.

ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలలో నూతన కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా నియమించారు.

జిల్లా స్థాయిలో గట్ల ప్రకాష్‌ను ప్రధాన కార్యదర్శిగా, బద్రి సుజన్ కుమార్‌ను కన్వీనర్‌గా, చిప్ప నిరంజన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, దీకొండ అజయ్ కుమార్‌ను జాయింట్ సెక్రటరీగా, గోట్టి రమేష్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు.

కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆనంద్ రాజు (సెల్: 9951199321), ప్రధాన కార్యదర్శిగా బాలే అజయ్‌ ను, అధికార ప్రతినిధిగా కైలాస సాయి కృష్ణను, ఇన్‌చార్జిగా గట్ల కిరణ్ కుమార్‌ను, కోరుట్ల మండల అధ్యక్షుడిగా జుగ్గి వినయ్ కుమార్‌ను ఎంపిక చేశారు.

జగిత్యాల నియోజకవర్గ అధ్యక్షుడిగా కంది చంద్రశేఖర్ రావు (సెల్: 9440368066), ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జహంగీర్, జగిత్యాల మండల అధ్యక్షురాలిగా కోటగిరి రాజేశ్వరి నియమితులయ్యారు.

ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షుడిగా బుర్ర నాగరాజు (సెల్: 9502199469), ప్రధాన కార్యదర్శిగా కురికల హనుమాన్ శేఖర్‌ను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన సభ్యులకు వినతి పత్రాలు, ఐడీ కార్డులు అందజేయడంతో పాటు సమాచార హక్కు చట్టంపై అవగాహన పుస్తకాలను బహూకరించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వోడ్నాల రామారావు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి కమిటీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం పొందడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తమ సభ్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నియమితులైన ప్రతినిధులను సంప్రదించి ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles