(బాలే అజయ్ – 9290277727)
రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కోరుట్ల పోలీసులు ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం కోరుట్ల పట్టణం మరియు వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోరుట్ల ఎస్ఐ చిరంజీవి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, స్వయంగా ముందుండి నిర్వహించారు.
పాలక వర్గం, ఎంపీడీవో, రెవెన్యూ శాఖ, ఆర్ & బీ ఏఈ, ఎంవీఐ, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎస్ఐ చిరంజీవి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామ సభ అనంతరం, ఆయన సూచనల మేరకు గ్రామ ప్రజల సహకారంతో రహదారులపై ప్యాచ్ వర్క్ పనులు చేపట్టడమే కాకుండా, గ్రామ రహదారుల పక్కన పెరిగిన పొదలను తొలగించి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న చిన్న జాగ్రత్తలతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.
