28.1 C
Hyderabad
Tuesday, September 15, 2026
No menu items!

వృద్ధ మహిళను మోసం చేసి బంగారం కాజేసిన కిలాడీ లేడీ అరెస్ట్

24 గంటల్లో కిలాడి. లేడీ నీ అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు
(తెలంగాణ సామ్నా డెస్క్)
బస్టాండ్ లో పరిచయం పెంచుకొని మాయమాటలతో మోసం చేసి బంగారం దోచుకు వెళ్లిన ఓ కిలాడి లేడిని కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు.

కోరుట్ల సీఐ కె లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రోజున మధ్యాహ్నం కోరుట్ల బస్టాండ్ లో రాయికల్ వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్న కోటేగంగు అనే 70 సంవత్సరాల వయసుగల వృద్ధురాలితో ఓ యువతి పరిచయం పెంచుకుంది.
మాయ మాటలతో ఆరోగ్య సమస్యలు తెలుసుకొని నీకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి కదా నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడని నమ్మించి ఆ వృద్ధ మహిళను ఆటోలో కోరుట్లలోని నంది చౌరస్తా దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడ ఉన్న ఒక బిల్డింగ్ను చూపించి ఇందులో డాక్టర్ ఉంటాడని నీకు ఎక్స్రే తీయాల్సి ఉంటుందని చెప్పింది. ఎక్స్రే తీసే క్రమంలో మెడలో ఏ వస్తువులు ఉండకూడదని ముసలావిడ మెడలోంచి 25 గ్రాముల బంగారు గొలుసులు తీసుకొని ముసలావిడను ఒకచోట కూర్చోబెట్టింది.
ఆ తర్వాత కూరగాయలు కొనుక్కొని వస్తానని నమ్మించి బంగారు గొలుసుతో ఊడయించింది.
గొలుసుతో ఊడయించిన మహిళా ఇంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి అదే రోజు రాత్రి కోరుట్ల ఎస్సై చిరంజీవిని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంటనే తన తోటి సిబ్బందితో రంగంలోకి దిగాడు. బస్టాండ్ నందు నంది చౌరస్తా ఏరియాలో అమర్చిన సీసీ కెమెరాలు పరిశీలించిన ఎస్సై వృద్ధ మహిళ ద్వారా నేరస్తురాలు వివరాలు సేకరించారు. అనంతరం సదరు కిలాడీ లేడీనీ సోమవారం రోజున ఉదయం కోరుట్ల బస్టాండ్ లో ఆ మహిళను గుర్తించి అదుపులోనికి తీసుకొని విచారించారు.
సదరు మహిళ నవీపేట మండలం మోకానిపల్లె గ్రామం కు చెందిన దండ లావణ్య గా గుర్తించారు.
ఈ మహిళపై ఇదే రకమైన ప్రవృత్తితో వివిధ పోలీస్ స్టేషన్లో గతంలో కేసులు నమోదు అయి ఏడాది పాటు జైలు జీవితం గడిపిన రికార్డు ఉన్నట్టుగా సీఐ తెలిపారు.
తీసుకెళ్లిన బంగారాన్ని శనివారం రోజు నిజామాబాద్ కు చెందిన ఆకుల ప్రసాద్ అనే స్వర్ణకారునికి అమ్మగా వచ్చినా రెండు లక్షల 50 వేల రూపాయల నుండి కొంత ఖర్చు చేసుకుంది. మళ్లీ దొంగతనం చేయడానికి సోమవారం రోజు కోరుట్ల కు వచ్చిన నేపథ్యంలో పోలీసులు చాకచక్యంగా ఆమెను అరెస్టు చేశారు.
నిందితురాలి వద్ద నుండి రెండు లక్షల మూడు వేల రూపాయలు నగదు అలాగే ఆకుల ప్రసాద్ వద్ద నుండి బంగారం గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు.
దొంగ బంగారం కొన్నందుకు గాను ఆకుల ప్రసాద్ ను కేసులో ఇన్వాల్వ్ చేసి రిమాండ్ కు పంపామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎవరైనా గుర్తుతెలియని మహిళలు చనువుగా ప్రవర్తించడం లేదా ఉద్దేశపూర్వకంగా మాట కలపడం లాంటి ప్రయత్నాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.
కేసు నమోదు చేసిన వెంటనే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్పల్లి డి.ఎస్.పి రాములు పర్యవేక్షణలో సీఐ లక్ష్మీనారాయణ సూచన మేరకు ఎస్సై చిరంజీవి ఏఎస్ఏ రాజశ్రీ హెడ్ కానిస్టేబుల్ లింబాద్రి కానిస్టేబుల్ కిరణ్ రాజ్ కిరణ్లు కిలాడీ లేడిని పట్టుకోవడంలో విశేష కృషి చేసినందుకు ఎస్పీ అశోక్ కుమార్ వారిని అభినందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles