(కథలాపూర్ -సంతోష్ )
గ్రామ దేవత అయిన అమ్మవారి ఆశీస్సులతో దుర్గమ్మ బోనాల పండుగ జాతర కథలాపూర్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, భక్తుల జయ జయ నినాదాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. గ్రామానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దుర్గమ్మ తల్లి కృపాకటాక్షాలతో బోనాల పండుగ జాతర ఘన విజయవంతమైంది.
