
(బాలే అజయ్, కోరుట్ల)
సోమవారం కోరుట్ల బస్ స్టాండ్ లో పోలీసులు డాగ్ స్కాడ్ తో సెర్చ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, బస్టాండు మరియు ముఖ్యమైన రద్దీ ఉండే ప్రదేశాల్లో, మార్కెట్ ఏరియాలలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను మరియు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా సేకరిస్తున్నారా? తరలిస్తున్నారా? అనే అనుమానంతో తనిఖీలు జరిగాయి. జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించడం జరిగింది, ప్రజలంతా కూడా అనుమానిత వ్యక్తుల గురించి లేదా మత్తు పదార్థాల రవాణా సమాచారం గురించి తెలిసినచో సంబంధిత పోలీసువారికి తెలియ జేయాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపారు.
