29.2 C
Hyderabad
Wednesday, September 16, 2026
No menu items!

వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

( బాలే అజయ్, కోరుట్ల)


జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ పునః ప్రతిష్ఠ జరిగి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు పడిగేల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమాల్లో మొదటి రోజు సహస్ర కలశ స్థాపనలో భాగంగా మహిళలు జవహర్ రోడ్ లోని ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రత్యేకించి పూజించిన కలశాలను నెత్తిన పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా వాసవి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు అమ్మవారికి హారతి సమర్పించారు. కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు పాలేపు రాము శర్మ వైదిక నిర్వహణలో భాగంగా గణపతి పూజ, స్వస్తి పుణ్యహవచనం, కలశ స్థాపన, సహస్ర కలశ స్థాపన కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పడిగేల పవన్, సంఘ అధ్యక్షులు పడిగేల శ్రీనివాస్, కార్యదర్శి ఎలిమి బుచ్చన్న, కోశాధికారి చౌదరి సూర్యకాంత్, మహిళా అధ్యక్షురాలు, బూస మాధురి, మాజీ అధ్యక్షులు నీలి కాశీనాథ్, కోటగిరి ప్రసాద్, పిఆర్ఓ బట్టు హరికృష్ణ, వాసవి క్లబ్ సీనియర్ సిటిజెన్ అధ్యక్షులు కొత్త గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles