(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు జన్మదిన వేడుకలను కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి 25 కిలోల బియ్యాన్ని దేవాలయానికి అందజేశారు.
అలాగే నివేదిత ఆశ్రమాన్ని సందర్శించిన నాయకులు అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, ఆశ్రమానికి 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు నేమూరి భూమయ్య ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు అన్నప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా, అందులో మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ మాట్లాడుతూ, జువ్వాడి కృష్ణారావు ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని జువ్వాడి కృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
