
(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఈ రోజు అనగా మంగళవారం డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మార్చి 29, 2026 నాటికి ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదై, సుమారు రూ.10,000 కోట్ల ప్రయాణ చార్జీలను మహిళలు ఆదా చేసుకున్న సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత-గంగాధర్ హాజరయ్యారు. విచ్చేసిన అతిథులను డిపో మేనేజర్ మనోహర్ ఫ్రూట్ బొకేలు, శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మహాలక్ష్మి పథకం ప్రాధాన్యతను వివరించి, మహిళల సాధికారతలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే రెగ్యులర్‌గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
