చివరి రోజున కోరుట్లలో ఆస్తి పన్ను రూ.6 లక్షల వసూళ్లు
(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆర్థిక సంవత్సరం చివరి రోజు సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పాత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కౌంటర్‌కు పౌరుల నుంచి మంచి స్పందన లభించింది.
చివరి రోజున ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగ పన్ను వసూలు కార్యక్రమంలో పురపాలక సంఘం సిబ్బంది నిమగ్నమై ఉండటం విశేషం.
మొత్తం రూ.6,00,000 (ఆరు లక్షలు) ఆస్తి పన్ను వసూలైనట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణ అభివృద్ధికి పన్నులు సమయానికి చెల్లించడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సహకరించిన పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్పసన్ తిరుమల వసంత గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్‌తో పాటు పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
