
(తెలంగాణ సామ్నా డెస్క్) తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సరి కొత్త సంచలనం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గురువారం సిట్ అధికారులు కేసిఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఆ తరువాత శుక్రవారం కేసీఆర్ ను ఆయన ఫామ్ హౌస్ లోనే నేరుగా విచారించడానికి సిట్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయంగా సంచలనం కాబోతున్న కెసిఆర్ విచారణతో ఫోన్ టాపింగ్ విచారణ తుదిదశకు చేరినట్టుగానే చెప్పవచ్చు. కెసిఆర్ ను విచారించిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయంపై రాజకీయ అంచనాలు మొదలయ్యాయి.
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో గతంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు, వారిచ్చిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకొని సిట్ అధికారులు పెద్దాయన ఎవరు అనే కోణంలో విచారణ చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కేసీఆర్ ను విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం.
