(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి జనసేన మహాసభను విజయవంతం చేయడమే లక్ష్యంగా కోరుట్ల నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. కోరుట్ల పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని గ్రామ, మండల స్థాయి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆగస్టు 8న నిజామాబాద్‌లో నిర్వహించనున్న పార్లమెంట్ స్థాయి జనసేన మహాసభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసే దిశగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
తెలంగాణలో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని కోరుకుంటున్నారని, ఆ ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎదుగుతోందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూపొందించిన కార్యాచరణతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో వీర మహిళలు వోడ్నాల సౌజన్య, కవిత, లహరి, జిల్లా సీనియర్ నాయకుడు వోడ్నాల రామారావు, నియోజకవర్గ నాయకులు అడ్లగట్ట సురేష్, బసవేని రమేష్, ఎలుగందుల అజయ్, సాయికృష్ణ, విజయ్, రంజిత్, శశి, రాజు, రాకేష్, ప్రభాకర్, గంగాధర్, ఆనంద్, గంగం అజయ్, వెంకటేష్, మారుతి, సంపత్, సంజీవ్‌తో పాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల, బోధన్ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.
