26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

“నిప్కలు” (ముడితే సురుక్కు మంటది)

(నిన్నటి తరువాయి)

నమ్మి కుటీరాల హక్కు పత్రాలపై సంతకాలు చేసిన తరువాత వెంకటవర్మ పుత్రులు తమ నిజస్వరూపాన్ని చూపెట్ట సాగారు. కుటీరాలు మొత్తం తమవేనని అందుకు తగిన అధారాలు తమ వద్ధ వున్నాయని వారు కుటీర యజమానులను బెదిరించారు. దీనితో దిక్కుతోచని పరిస్థితిలో వారి తండ్రిగారైన వెంకటవర్మను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. విషయం అంతా విన్నా వెంకటవర్మ ‘‘మీరు ఏం ఇబ్బంది పడకండి. మళ్లీ రాజుల వారికి ఆర్జీ పెట్టుకొండి. నేను మళ్లీ కుటీరాలు ఇప్పిస్తాను’’ అని హామీ ఇచ్చాడు. దీనితో గత్యంతరం లేక వారు బోరుమని ఏడ్చారు. కొందరు యువకులు రాజుల వారి దృష్టికి తీసుకువెళతామని రాజభవనానికి వెళితే తమ అనుచరుల ద్వారా విషయం తెలుసుకొని వారందరిని బంధీలను చేసి చిత్రహింసలు చేయించాడు. మరికొందరిని ఆడవిలోకి తీసుకెళ్లి ఆయుధాలతో చంపివేయించాడు. ఈ విషయం తెలిసినా రాజ్యంలో ఎవ్వరు నోరు మెదపడానికి బయపడేవారు.

అలా విపరీతంగా బంగారు నాణేలు కూడ బెట్టిన కొడుకులు కూడా అవంతీ రాజ్యంలో తమ హవా నడవాలంటే రాజుల వారిని పొగడాలనే విషయాన్ని తెలుసుకున్నారు. రాజుల వారికి పొగడ్తలు అంటే చాలా యిష్టం అని, తనను పొగిడిన వారిని దగ్గరకు తీసుకుంటాడని, ముఖస్తుతి చేయకపోతే పట్టించుకోడని తెలుసుకున్నారు. దీనితో రాజుల వారిని నిరంతరం పొగిడేలా వుండాలని రాజుగారి నిత్యకృత్యాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేసేడివాడు. బుర్రకథలు చెప్పించడం, దండోరా వేయించడంతో పాటుగా కాగితాలపై రాజుగారి గురించి రాయించి గ్రామగ్రామానా పంచి ప్రచారం చేసేడివారు. అలా రాజులవారికి ముగ్గురు మరింత దగ్గరయ్యారు. ఆ తరువాత ముగ్గురు కలిసి మరెన్నో బంగారు నాణేలు అక్రమంగా పోగుచేయడమే కాకుండా రాజధాని సమీపంలో అత్యంత విలువైన భూముల్ని తమ వశం చేసుకున్నారు.


అలా కొద్ది కాలం అయ్యేలోగా వారి బంగారు నాణేల సంపాదన, భూముల కబ్జా లెక్కలేనంతగా పెరిగింది. దీనితో వారిలో సహజంగా అహం కూడా పెరిగింది. అదే సమయంలో తమ హోదాను, తను రాజ వంశానికి చేస్తున్న ప్రచారాన్ని రాజుకు చూపించి రాజప్రసాదంలో తన ఇద్ధరు పుత్రులతో పాటుగా పౌత్రునికి కూడా దండనాయకులుగా నియామకం అయ్యేలా చేసుకున్నారు.


అలా ప్రజాజీవనంలో ముఖ్య పాత్ర పోషిస్తునే, తమ ప్రచార కారకాలైన బుద్రకథలు, ఒగ్గుకథలు, కాగితాలపై రాజుల వారి నిత్య కార్యక్రమాలు ప్రజలకు తెలిపేడివారు. ఒక రకంగా నిత్య భజన చేసేడివారు అని ఆ రాజ్య ప్రజలు చెప్పుకునేడివారు. అలా అవంతీ రాజ్యంలో ఒక సాధారణ సిపాయిగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి, కుటీరాల వెంకటవర్మగా పేరు సంపాదించి, తన వారిని అవంతీ రాజ్యంలో ముఖ్యలుగా చేసి, రాజుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రచార వ్యవ్థను ఎర్పాటు చేసి, దండనాయకుల స్థానానికి ఎదిగేలా చేసిన వెంకటవర్మ గురించి ఆ రాజ్యంలో కథలు కథలుగా చెప్పుకునేడివారు.


గమనిక: ఇది ఒక సాధారణ కథ మాత్రమే. దీనికి భారతదేశంలోని ఓ రాష్ట్రంకు సంబంధించిన రాజకీయాలకు, రాజకీయ ప్రముఖులకు ఎలాంటి సంబంధము లేదు. కావున పాఠకులు గమనించగలరు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles