26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

ఢీల్లీిలో ‘‘ఆప్‌’’ను ఊడ్చి పారేసిన కమలం

తెలంగాణ సామ్నా డెస్క్‌: కొన్ని విజయాలు ఆనందాన్ని ఇస్తాయి. మరికొన్ని విజయాలు స్పూర్తినిస్తాయి. చాలా తక్కువ విజయాలు మాత్రమే అటు ఆనందాన్ని ఇటు స్పూర్తిని ఇస్తాయి. అలాంటి విజయమే బీజేపికి ఢీల్లీ ఆసెంబ్లీ రూపంలో వచ్చింది.

రెండు పార్లమెంట్‌ స్థానాలనుండి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లు… ఎనిమిది స్థానాల నుండి 48 స్థానాలకు ఎదిగి ఢీల్లీలోఅధికారం సంపాదించడం అంటే మాములు విషయం కాదు. దాదాపుగా మూడు దశాబ్ధాల కాలం తరువాత బీజేపి జెండా ఢీల్లీ ఆసెంబ్లీలో ఎగురబోతుంది. ఢీల్లీలో ఆధికారం రావడానికి బీజేపి తన శక్తియుక్తులన్ని ప్రదర్శించింది అనే చెప్పవచ్చు. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీ‘‘వాల్‌’’ లాంటి ‘‘గోడ’’ను కూల్చడమంటే ఆషామాషి వ్యవహరం కాదు. ఆ పార్టీ మీద ఢీల్లీ ప్రజలకు ఒక నమ్మకం ఎర్పడిరది. తమ కోసం పని చేసే నాయకుడు దొరికాడని ఢీల్లీ ప్రజలు విశ్వసించారు. కాని అదంతా మేకతోలు కప్పుకున్న గుంటనక్క వ్యవహారమే అని వారికి తెలియడానికి చాలా సంవత్సరాలు పట్టింది. లిక్కర్‌ స్కాంలో జైలుకు వెళ్లిన తరువాత కేజ్రీవాల్‌ అసలు రంగు బయటపడిరది. అంతవరకు ఒక సామాన్యునిలా కనిపించిన కేజ్రీవాల్‌ ‘సీసా మహల్‌’ రాజభోగాలు తెలిసిన తరువాత ఢీల్లీ ప్రజలు అసహ్యించుకోవడం ప్రారంభించారు.

అప్పటినుండే కేజ్రీవాల్‌ పతనం ప్రారంభం అయ్యింది అని చెప్పుకోవచ్చు. తను ఒక సామాన్యునిలా కనిపించడానికి చేయించుకున్న ‘‘డ్రెస్‌ డిజైనింగ్‌’’ చాలా కలిసివచ్చింది. తాను ఒక ముఖ్యమంత్రిని కాదు ఒక సామాన్యున్ని అనే విధంగా కనిపించడం తన రాజకీయాలకు బాగా కలిసివచ్చిందనే చెప్పవచ్చు. ఆ వేషధారణతోనే పంజాబ్‌ , హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, గోవా రాష్ట్రాలలో పాగా వేయాలని అనుకున్నాడు. తన పార్టీకి జాతీయపార్టీ హోదా వచ్చేలా చూసుకున్నాడు.

ఇంతవరకు బాగానే వున్న అవినీతి అంతం ఆప్‌ పంతం అని డాంభీకాలు చెప్పుకున్న కేజ్రీవాల్‌ పతనం లిక్కర్‌ స్కాంలో జైలుకు వెళ్లినాకా మొదలైంది అని చెప్పవచ్చు. ఢీల్లీ ప్రజలు ఆప్‌ గురించి ఆలోచించడం ప్రారంభించారు. తమను ఎదో ఒక పథకం పేరు చెప్పి మోసం చేస్తున్న తీరును గుమనించారనే చెప్పాలి. సరిగ్గా ఆ సమయాన్ని బీజేపి వాడుకుంది. తాను వుంటున్న ‘‘సీసా మహల్‌’’ గురించి విపరీతమైన ప్రచారం చేసింది. అది జనంలోకి బాగా వెళ్లింది. దానికి తోడు ఆప్‌లో అడుగడుగునా అవినీతి కనిపించడంతో ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఇండి కూటమిలో వున్న కాంగ్రెస్‌తో పొత్తు వుండదు అనే ప్రకటన వచ్చింది. హర్యానాలో తనకు అడిగినన్ని సీట్లు ఇవ్వలేదని, ఢీల్లీలో కాంగ్రెస్‌ను దూరం పెట్టాడనే వాదన వుంది.
ఒకవైపు బీజీపి ఈసారి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ముందుకు పోయింది. పకడ్భందిగా ప్రణాళికలు సిద్దం చేసుకొని ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. బీజేపి ఈ విజయానికి చాలా కారణాలు వున్నాయి. అందులో ముఖ్యమైనదిగా చెప్పుకునేది ప్రతిపక్షాల అనైక్యత. ఓ వైపు ఆప్‌కు పడాల్సిన మైనార్టీ ఓట్లను అటు కాంగ్రెస్‌ , ఇటు ఎంఐఎం లాక్కున్నాయన్న వాదన వస్తున్నది. ఆ రెండు పార్టీలకు ఒక్క సీటు రాకున్నా వచ్చిన ఓట్లు మటుకు ఆప్‌కు వెళ్లాల్సినవే అనే మాట వినవస్తున్నది.
నిజానికి కేజ్రీవాల్‌ అవినీతి మురికి అంటించుకోకపోతే మళ్లీ గెలిచేవాడేమో! ఎందుకంటే ఢీల్లీలో వున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపికి పట్టం కట్టిన ఢీల్లీ ఓటర్లు ఆసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఆప్‌కు పట్టం కట్టారు. అంటే కేంద్రంలో మోడీ రాష్ట్రానికి కేజ్రీవాల్‌ కావాలనే ఢీల్లీ ఓటర్లు భావించారు. కాని కేజ్రీవాల్‌ అతి విశ్వాసం, అవినీతి వల్ల ఢీల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను పక్కపపెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడన్న వాదన వస్తున్నది.
తన స్వీయ తప్పిదాలతో తనతో పాటుగా తన పార్టీని కూడా ఢీల్లీలో భ్రష్టు పట్టించాడు అనే విమర్శ వస్తున్నది.

మొత్తానికి దేశం యావత్తు ఉత్కంఠతో ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలు శనివారం వచ్చి దేశం బీజేపి వైపు చూసేలా చేశాయి అనే ప్రశంస వస్తున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles