27.9 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

నాథురామ్‌ గోడ్సే “వాంగ్ములం”

(నిన్నటి తరువాయి)

  1. నేను చాల సంవత్సరములు ఆర్‌.యస్‌.యస్‌.లో పనిచేసి తరువాత హిందూ మహాసబలో చేరి, దాని సమగ్ర హిందూ పతాకము క్రింద ఒక సైనికుడిగా పోరాడుటకు ఆర్పణ చేసికొనినాను. ఈ సమయములోనే వీరసావర్కరు హిందూమహాసభ అధ్యక్షుడుగా ఎన్నిక కాబడినారు.వారి అయస్కాంతము వంటి నాయకత్వము, సుడిగాలివంటి ప్రచారముతో హిందూ సంఘటనోద్యమము ఇంతకు ముందెప్పుడు కనీవిని ఎరుగనంత విద్యుదీకరణతో జీవశక్తిని పొందినది. కోట్లాది హిదువులు, తాము కోరుకొనిన నాయకుడుగా అత్యంత విశ్వాసముతో హిందూ ఆశయాలను ప్రతిపాదించగల ఆదివక్తగా అతనివైపు ఆశా విశ్వాసములతో చూడసాగినారు. అందులో నేను ఒకడిని. హాందూమహాసభ కార్యక్రమములను నిర్వహించుటలో మిక్కిలి శ్రద్ధా శక్తులతో పనిచేయటచే నేను వీర సావర్కరుతో వ్యక్తిగత పరిచయము పొందుట జరిగినది.
  2. తర్వా తర్వాత, నా స్నేహితుడు, హిందూ సంఘటనోద్యమమురలో సహ కార్యకర్త అయిన ఆప్టే, నేను కలసి హిందూ సంఘటనోద్యమమునకు ఆర్పితమైన ఒక దిన పత్రికను నిర్వహించవలెనని నిర్ణయించుకొనినాము. మేము చాలమంది హిందూ సంఘటనోద్యమ నాయకులను కలసుకొని వారినుండి సానుభూతి, ఆర్థిక సహాయము పొందిన తర్వాత హిందూ మహాసభ అధ్యక్షుడిగా వీర సావర్కరును కలసుకొనినాము. మేము తలపెట్టిన కార్యముయెడ ఆయన కూడా తన సానుభూతిని చూపినారు. అంతేకాదు. వీలైనంత త్వరలో మేము ఒక లిమిటెడ్‌ కంపనీని ఏర్పాటు చేసి, తాను ఆడ్వాన్సుగా ఇచ్చు పైకమును ఆ కంపెనీ వాటాలుగా మార్చు నిబంధనపై మాకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడిగా ఇచ్చినారు.
  3. అనుకొన్నట్టుగా ‘‘డెయిలీ ఆగ్రణి’’ అనే దినపత్రికను ప్రారంభించి ఆ తర్వాత ఒకద్ది కాలములోనే ఒక లిమిటెడ్‌ కంపనీని ఏర్పాటుచేసినాము. వీరసావర్కరు, ఇంకా కొందరు పెటుట్బడిగా ఇచ్చాన పైకమును ఒక్కొక్క రూ. 500లు విలువగల వాటాలుగా మార్చినాము. దీనితో సేథ్‌ గులాబ్చంద్‌ (శీమానÊ సేథ్‌వాల్‌చంద్‌ హీరాచంద్‌ సోదరుడు) బోర్‌ సంస్తాన మాజీమంత్రి షిగ్రే, కొల్లాపూర్‌ ఫల్మువని ప్రముఖుడు సంచాలకులుగాను, పోషకులుగాను వుండినారు. నేను ఆప్టే ఇందులో కార్యనిర్వాహక సంచాలకులుగా వుండినాము. నేను పత్రికా విధానమునకు పూర్తిగా బాధ్యత వహించి సంపాదకుడుగా పనుండినాను. పూర్తిగా చట్టబద్దమైన పద్దతిలో హిందూ సంఘటన ఆవయ వ్యాప్తికి రెండు సంవత్సరముల పాటు ఈ పత్రికను నడిపినాను.

(తరావాయి రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles