26.3 C
Hyderabad
Monday, August 3, 2026
No menu items!

నాధూరాం గోడ్సే “వాంగ్ములం”

(నిన్నటి తరువాయి)

  1. డిల్లీలో గాంధీజీ ప్రార్థనా సమావేశము వద్ద ప్రదర్వన జరుపుటకుమా భవిష్యత్‌ పథకమును గూర్చి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, అంత ఇష్టము లేకుండానే అంగీకరించినాను. అయితే ఏర్పనడిన నూతన పరిస్థితులలో బొంబాయి నుండి, పూణే నుండి డిల్లీకి ఇష్టపడి వచ్చే సమర్థులైన వలంటీర్లను సేకరించడం అసాధ్యమైపోయినది. అంతేకాకుండా మా వద్ద నుండిన నిధులు పూర్తి వ్యయమైపోయినందున వాలంటీర్లను బొంబాయి నుండి డిల్లీకి తీసుకొని మరల వారిని బొంబాయికి చేర్చే స్థోమత ముకు లేకుండా పోయినది. అందువలన మేము గ్వాలియర్‌కు పోయి అచ్చట హిందూరాష్ట్ర సేవా వాలంటీర్లకు నేతృత్వము వహిస్తున్న డాక్టరు పర్చురేను కలుసుకొదలచినాము
  2. . గ్వాలియర్‌ నుండి డిల్లీకి వలంటీర్లను తీసుకొనిపోవుట ఖర్చు తక్కువతో కూడిన పని కూడా 1948 జనవరి 27వ తీది వామానములో మేము డిల్లీకి చేరి ఆ రాత్రే రైలులో ప్రయాణము చేసి తెల్లవారేలోగా గ్వాలియర్‌ చేరినాము. అప్పటికి ఇంకా చీకటిగానే వున్నందున స్టేషన్‌ సమీపంలోని ధర్మశాలలో ఆగి, ఉదయమే డాక్టరు పర్చురేని కలుసుకొనినాము. అతను తన వైద్యశాలకు పోవు హడావుడిలో వుండి మమ్ములను మధ్యాహ్నము తర్వాత కలుసుకోమనినాడు. మేము అతనిని సాయంత్రంనాలుగు గంటలకు కలుసుకొనినాము. తన నాయకత్వంలోని వాలంటీర్లను స్థానిక సమస్యలతో మునిగి యున్నందున, ఆయన మాకు సహాయము చేయుటకు ఉత్సాహము చూపుటలేదని గ్రహించినాము. పూర్తిగా నిరుత్సాహపడిపోయిన నేను, ఆప్టేను వెంటనే తిరిగి బొంబాయి, పుణేలకు పోయి అచ్చటనే వలంటీర్లను సేకరించుటకు ప్రయత్నించెదనని ఆప్టెకి చెప్పి నేను డిల్లీకి వచ్చివేసినాను. రహస్య అమ్మకమునకు ఎక్కడపడితే అక్కడ రివాల్వర్లు దొరుకుచుంటచే, నేనూ, ఆన్టే, ఒక రివాల్వరును, ఒక పిస్టలును సంపాదించుకొనుటకు గ్వాలియరుకు పోయినా మనుటకు నేను నిర్ద్వంద్వముగా ఖండిరచుచున్నాను.
  3. నిరాశా నిస్పృహలతో డిల్లీ చేరిన నేను శరణార్థుల శిభిరములకు పోయినాను. ఆ శరణార్థుల శిబిరములలో తిరుగుచున్నప్పుడే నా ఆలోచనలు ఒక స్పష్టమైన తిరుగులేని రూపమును పొందినవి. అదే సమయములో యాదృచ్చికముగా ఒక ఆయుధముల నమ్ము శరాణార్థిని కలుసుకొనినాను. అతడు నాకు ఒక పిస్టలును చూపినాడు. తర్వాత నేను కాల్పులు జరిపినది ఈ పిస్టలుతోనే. మరల డిల్లీ రైల్వే స్టేషనుకు వచ్చి తర్వాత 29వ పతేదీ రాత్రంతా ఇప్పటి ఆరాచకమును, ఇంకను జరుగనున్న హిందువుల వినాశనమును అంతమొందించుటకు నేను తీఉకొన్న నిర్ణయమును గూర్చి మరల మరల ఆలోచించినాను. ఈ సందర్భములో నేరారోపకులు విలువలు, పలువలు చేసి వర్తించిన, రాజకీయములలోను ఇతర విధములుగాను వీర సావర్కరుతో నాకు గల సంబంధములను గూర్చి ఇప్పుడు వివరిస్తాను.
    (తరావాయి రేపు)

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles