
స్మార్ట్ వర్క్ పాలసీ… వారంకు ఒక రోజే పని.. టార్గెట్ వందల కోట్లు
సంపాదన లక్ష్యం వందల కోట్లు, వంద అమ్మాయిలతో జల్సాగా తిరగడం
తెలంగాణ సామ్నా డెస్క్: హెడ్డింగ్ లు చూసి ఇదేదో కష్టపడి పైకొచ్చిన యువకుని కథ అనుకునేరు..! కాని అది కాదు. ఈ యువకుని పాలసీయే డిఫరెంట్. తెలివి వుండి, పట్టుదల వుండి, టార్గెట్ ఖచ్చితంగా చేరుకోవడనికి సరిjైున ప్రణాళిక వుంటే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు అనుకున్నాడో యువకుడు. అది మంచియా చెడుయా అనేది తరువాత విషయం. అలాగని అతనేం ఔత్సాహిక పారిశ్రామిక వేత్త కాదు. స్టార్టప్ బిజినెస్ ప్రారంభించలేదు. అతనో కంప్యూటర్ ఇంజనీరేమీ కాదు. కోట్లాది మందికి ఉపయోగపడే పొగ్రాం డిజైన్ చేసి పెటెంట్ హక్కులు పొంది కొట్లాది రుపాయలు సంపాదించాడు అనుకోవడానికి.లేదు.
సాధించాలనే తపన విపరీతంగా వున్న వ్యక్తి. కాని అది సక్రమమైన మార్గంలో కాదు. దొంగతనంగా. దొంగగా మారి సంపాదించాలని అనుకున్నాడు. ఆ సంపాదనకు కూడా లక్ష్యం పెట్టుకున్నాడు. ఎంతో సంపాదించాలో, ఎలా సంపాదించాలనుకున్నాడో పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. పని ప్రారంభించాడు. పనిభారం కూడా ఎక్కువగా వుండకూడదనుకన్నాడు. వారంకు ఒక్క రోజే తన ‘‘డ్యూటీ’’ చేసుకొవాలనుకున్నాడు. వీకేండ్‌లో ఎట్టి పరిస్థితిల్లో పనిచేయకూడదని కూడా నిశ్చయించుకున్నాడు. మిగిలిన మూడు రోజుల్లో హాయిగా ఇంట్లో కూర్చుండి ఎక్కడ దొంగతనం చేయాలి? ఎలా దొంగతనం చేయాలి అనే విషయంపై క్షుణ్ణంగా ఆలోచించి రెక్కి నిర్వహించి గురువారం దొంగతనం చేస్తాడు. ఇవి క్లుప్తంగా ఆ యువదొంగ వివరాలు.
ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న యువకుని పేరు బత్తుల ప్రభాకర్. కొద్ది రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ పబ్ వద్ద కాల్పులు జరిపి పోలీసులకు దొరికిన బత్తుల ప్రభాకర్‌ది దొంగతనంలో విన్నూత తరహ అని చెప్పుకుంటున్నారు. సోమ, మంగళ, బుధ వారాలు ఎక్కడ దొంగతనం చేయాలో పక్కా చేసుకోవడం, గురువారం దొంగతనం చేయడం, శుక్ర, శని, ఆదివారాలు ఎంజాయ్ చేయడంతో అతని వారం పూర్తవుతుంది. విచారణలో ప్రభాకర్ చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయని చెబుతున్నారు. మరి కాదా!
నగదు ఎక్కువగా ఎక్కడ వుంటుందో గమనించడం, ఆ గమనించిన సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఫోటోలు కూడా తీసుకోవడం, మ్యాప్‌లు వేసుకోవడం లాంటి పకడ్బంది పనులన్ని చేసుకొని గురువారం దొంగతనం వెళ్లి పని పూర్తి చేసుకొని ‘‘లాభంగా’’ ఇంటికి రావడం, ఆపై అమ్మాయిలతో జల్సా చేయడం అతని వృత్తిగా మారింది. ‘‘ధృవ’’ అనే సినిమాలో హీరో తన లక్ష్యాలను నిర్దారించుకొని, ఫోటోలు తీసి వేలాడదీసుకొంటాడో అలాగే ప్రభాకర్ కూడా తన ప్లాట్‌లో అలాంటి సెటప్ చేసుకున్నాడు.

