నిన్నటి తరువాయి
ప్రతి ఒక్క ప్రాథమిక న్యాయ సూత్రము భంగపరచబడినది. ఈ పైశాచిక ప్రతిపాదనలకు కాంగ్రెసు సభ్యులు వెంట వెంటనే సమ్మతి తెలిపినారు. ఆ ప్రతిపాదనలకు మహాత్మా అశీర్వాదములు వున్నవని అప్పుడు బయట పెట్టబడినది. నిజమునకు ముందు గాంధీజీ ఎరుక, సమ్మతులతోనే ఆ ప్రతిపాదనలు చేయబడినవి. కాంగ్రెసు పూర్తి అంగీకారముతో భారతదేశములో 25 శాతము గల ప్రజలు, వారు 50 శాతమున్నట్లు ప్రాతినిధ్యమిచ్చి 75 శాతమున్న ప్రజలను 50 శాతమునకు పరిమితము చేసినారు. వైస్రాయి కూడా సమావేశము జరుపుటకు కొన్ని నిబందలను నిర్ణయించినాడు. అవి:
- కాంగ్రెసు ఇతర రాజకీయ పక్షములు, విజయము సాధించే వరకు జపానుకు వ్యతిరేకముగా యుద్ధమును నిర్నిబంధంగా బలపరచవలెను,
- కాంగ్రెసుకు ముస్లింలకు చెరి ఐదు ప్రతినిధులు వుండే మిశ్రమ ప్రభుత్వము ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో ఇంకా నిన్ను జాతులకు, శిఖ్కులకు, ఇతర అల్ప సంఖ్యాకులకు ఒక ప్రతినిధి వుండవలెను.
3.‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమము నిర్నిబంధంగా ఉపసంహరింపబడవలెను. ఆ ఉద్యమ కారంణంగా నిర్భందింపబడిన క్గాంఎసు నాయకులు విడుదల చేయబడతారు.- పరిపాలనా సంస్కరణలకై తీసుకొను చర్యలన్నీ 1935 భారత ప్రభుత్వపు చట్టపు పరిధిలోనే వుండవలెను.
5.గవర్నరు జనరల్ మరియు వైస్రాయికి అప్పుడు ఏ రాజ్యాంగ బద్దమైన స్థానము వున్నదో అదే స్థానము కొత్త ఏర్పాటులో కూడా వుండవలెను. అనగా ఆయనే ప్రభుత్వమునకు నాయకుడుగా వుండును.- యుద్ధవిరమణ తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభ యంత్రాంగము ద్వారా సంపూర్ణ స్వాతంత్య్రము విషయము నిర్ణయింపబడును.
- వీటిని ఏ సవరణలు లేకుండా అంగీకరించితే వైస్రాయి 2వ నిబంధన మేరకు అందరు భారతీయులు వుండెటట్టు తన ప్రభుత్వాన్ని పునర్నిర్మిస్తారు.
అంతకు మూడు సంవత్సరములు ముందు ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమమును ప్రారంభించి తిరుగుబాటు ఆచరణలో పెట్టుటలో సంపూర్ణ స్వాతంత్య్రము కొరకు సాధించండి లేక మరణించండి అని ప్రజలను ఉదో ్భధించిన పెద్ధలను ‘గప్‌చుప్’గా వైస్రాయి విధించిన నిబంధనల నన్నిటినీ ఒప్పుకొని ఆయన నాయకత్వము కింద అధికారమును స్వీకరించుటకు వినయ విధేయతలతో అంగీకరించినాడు. వాస్తవమేమిటంటే, ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమము వఫలమైనది, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయ కార్యక్రమమేమీ లేదు. కాంగ్రెసు పక్షము, దానికి సిద్ధముగ నున్నను లేకపోయినను, జరుగవలసిన కార్యక్రమములన్ని జరిగిపోసాగినవి. కాంగ్రెసు పతనము వలన జిన్నా ఒక్కడే లాభము పొందినవాడైనాడు. భవిష్యత్తులో జరుగు అన్ని సంప్రదింపులలో ముస్లింలకు 50 శాతము ప్రాతినిధ్యము హక్కును గుర్తింపు పొంది జిన్నా రాజకీయపు ఎత్తుగడలలో గొప్ప అనుకూల పరిస్థితిని చేకూర్చుకొనినాడు. ఆ సమవేశము హిందూ ముస్లిం ఐకమత్యమును సాధించుటలో విఫలమైనప్పటికీ, ద్విజాతి సిద్ధాంతమునకు, పాకిస్థాన్ కోరికను ద్విగుణీకృతమైన ప్రోత్సాహము కల్పించింది.
(మిగతా రేపు)

Chalaa mandiki teliyani, marachipoyina satyaalanu, congress party Kullu, kutantraalanu nirbheetigaa batata pedutunnarandi. Aa bhagavantudu meeku sadaa paripoorna aayur aarogyaalu aiswaryaalu ivvaalani koruku tunnaanu.
mee premaku danyunni