26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

(నిన్నటి తరువాయి)

కాంగ్రెసు జిన్నాకు లొంగిపోయినది:
తరువాత సంవత్సరములో కత్తి మెడ మీద పెట్టి బెదిరించినందున కాంగ్రెసు జిన్నాకు సంపూర్ణముగ లొంగిపోయి పాకిస్థాన్‌ కు అంగీకరించినది. దాని తర్వాత జరిగినదంతా అందరికి తెలిసినదే. ముస్లింలయెడ గాంధీజీ పెంపొందించుకొనిన వ్యామోహము దినదినాభివృద్ధి అవడమే ఈ కథనమంతటిలోను సాగుతున్న ఏకైక సూత్రము. ఆయన నిర్వాసితులైన హిందువుల యొడ సాననుభూతిని గాని, ఓదార్పునుగాని, చూపుతూ ఒక్కమాట మాట్లడలేదు. ఆయనకు మానవాళి యెడ ఒకే ఒక దృష్టి. అది ముస్లిం మానవాళి. హిందువులు ఆయనకు లెక్క చేయదగిన వారుగా తోచలేదు. గొంధీయ సాధుత్వము దాల్పిచన ఈ సిద్ధ పురుష పరిణామములు నన్ను నిర్ఘాంతపోవునట్లు చేసినవి.

పాకిస్థాన్‌ గూర్చి అస్పష్టమైన ప్రకటనలు:
గాంధీ ఒకానొక వ్యాసములో నామ మాత్రంగా, ఐతే ద్వందార్థంగా పాకిస్థాన్‌ను వ్యతిరేకించుతూ, ముస్లింలేగాని తెగించి పాకిస్థాన్‌ కావలసిందే అని పట్టుపడ్తే, దానిని సాధించకుండ వారిని ఆపగలదేదీ లేదని బహిరంగంగతా ప్రకటించినాడు. ఈ ప్రకటనను ఒక్క మహాత్ముడే ఆర్థము చేసుకోవలసి వుంది. ఇది ఒక భవిష్యత్‌ సూచనా? ఒక ప్రకటనా? లేక పాకిస్థాన్‌కు తన అసమ్మాతా?


కాశ్మీరు మహారాజుకు చెడ్డ సలహా
కాశ్మీరు విషయంలో సంస్థానాన్ని షేక్‌ అబ్దుల్లాకు కట్టబెట్టి కాశ్మీరు మహారాజా వారణాశిలో విశ్రాంతి తీసుకోవలసినదిగా గాంధీజీ మరల మరల ప్రకటించినాడు. కాశ్మీర్‌ జనాభాలో అధికులు ముస్లింలు కావడం కావడం తప్ప ఇందుకు మరే కారణమూ లేదు. హైదరాబాద్‌లో అధిక సంఖ్యాకులు హిందువులైనప్పటికి, నాజామును మక్కాలో విశ్రాంతి తీసుకోమని ప్రభోధించని గాంధీజీ వైఖరికి కాశ్మీరులో ఆయన వైఖరికి విరుద్ధముగా వుండుట గమనించదగియున్నది.


గోవధ విషయంలో గాంధీజీ:
తనకు గో సంరక్షణపై త్వీరమైన మక్కువ వున్నట్లు గాంధీజీ ప్రదర్శించుకుంటూ వుండేవాడు. కాని, అందుకుగా ఆయన ఏలాంటి ప్రయత్నము చేయలేదు. అందుకు విరుద్ధముగా ఆయన ప్రార్థనానంతర ఉపన్యాసములో గోవధను నిషేధమునకై కోర్కెను తాను బలపచే పరిస్తిలిఓ లేనని ఒప్పుకొనినాడు. ఈ సందర్భంలో ఆయన ఉపన్యాసము నుండి ఒక భాగమును ఈ క్రింద పొందుపరుస్తున్నాను.


‘‘చట్టరీత్యా గో నిషేధము కోరుతూ తనకు యాబై వేల పోస్టు కార్డులు, 20 నుండి 30 వేల టెలిగ్రాములు వచ్చినట్లు రాజేంద్రబాబు నాకు ఈ దినము తెలిపినాడు. ఈ విషయమై ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పియున్నాను. నాకు ఇనిన జాబులు టెలిగ్రాములు ఎందుకు పంపవలెను. వానితో ఏమీ సాధించలేదు. భారతదేశములో గోవధను నిషేధిస్తూ చట్టము చేయడానికి వీలు లేదు. తనంత తాను స్వేచ్చగా గోవధను వదలని వానిపై నా అభిప్రాయమును ఏ విధముగ రుద్దేది? భారతదేశము హిందువులకు, ముస్లింలకు పార్శీలకు, క్రైస్తవులకు ప్రత్యేకముగ చెందదు. భారతదేశము హిందువుల భూమి అయినదనే హిందువుల వాదన పూర్తిగా పొరపాటు. ఈ భూమి ఇక్కడ నివసించే వారందరికి చెందియున్నది. నాకు ఒక సనాతన వైష్ణవ హిందువు తెలుసు. అతను తన బిడ్డకు గో మాంసపు రసమును ఇచ్చేవాడు.

(మిగతా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles