26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాధురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

నిన్నటి తరువాయి


గాంధీజీ శక్తి మేరకు నిరాహార దీక్ష:
1943 తన శక్తి మేరకు నిరాహారదీక్ష పూనినప్పుడు రాజకీయములపైఃస ఆయనతో గోష్ఠి చేయుటకు ఎవ్వరికి అనుమతి ఇవ్వబడలేదు. అత్యంత ఆత్మీయులు, సన్నిహితుతులకు మాత్రము ఆయన ఆరోగ్యము గూర్చి విచారించుటకు అనుమతి ఇవ్వబడినది. సి. రాజగోపాలాచారి గాంధీజీ గదిలోనికి దొంగచాటుగా చేరుకొని పాకిస్థాన్‌ ఇచ్చుటకు ఒక కుట్ర పన్ని దాని విషయమైస జిన్నాతో సంప్రదింపులు జరుపుటకుగాంధీజీ అనుమతి పొందినాడు. కొంతకాలము తర్వాత 1944 సంవత్సరము ఆఖరు భాగంలో గాంధీజీ దీని విషయమై జిన్నాతో మూడు వారముల పాటు సంప్రదింపుటు జరిపి ఇప్పుడు పనాకిస్థాన్‌ అని దేనినైసతే పిలుస్తున్నామో పూర్తిగా దానినే జిన్నాకు సమర్పించు ప్రతిపాదన చేసినాడు. గాంధీజీ జిన్నా ఇంటికి ప్రతి దినము పోయినాడు.అతనిని పొగడినాడు. శ్లాఘించినాడు. ఇన్నిచేసి పాకిస్థాన్‌కై అతని మొండి పట్టుదల నుండి జిన్నాను మెప్పించి తప్పించలేకపోయినాడు. హిందూ ముస్లిం ఐకమత్యము వ్యతిరేక దిశలో పురోగమించసాగింది.


దేశాయి లియాఖత్‌ ఒడంబడిక:
1945లో అపఖ్యాతి గాంచిన దేశాయి లియాఖత్‌ ఒడంబడిక జరిగినద. ఇది జాతీయ ప్రజాస్వామిక పక్షముగ కాంగ్రెసు శవపేటికకు మకొక సీల..ఆఖరి సీలను బిగించింది. ఆనాడు కేంద్ర శాసనసభలోని కాండ్రెసు పక్షమునకు నాయకుడుగా నుండిన కీ.శే. బూలాభాయి దేశాయి, ముస్లింలీగు నాయకుడు లియాఖత్‌ ఆలీఖాన్‌తో కుదుర్చుకొనిన ఈ ఒడంబడిక ప్రకారము యుద్ధ ప్రారంభంనుండి పెరిగిపోపవుచుండిన భారత రాజకీయములలోని ప్రతిష్ఠభనకు ఒక పరిష్కారమును కనుగొనుటకు ఒక సమావేశమున ఏర్పరచవలసినదిగా బ్రిటిష్‌ ప్రభుత్వముపై సంయుక్తముగ ఒత్తిడి చేయుటకు ఒప్పందము చేసుకొనినారు. 1942 ‘‘క్విట్‌ ఇండియా’’ తీర్మానము చేసినప్పటి నుండి నాయుకులందరు నిర్భందములో వుండినందున, శ్రీ దేశాయి పై ఒడంబడిక చేసుకొనుటకు ముందు కాంగ్రెసులో ప్రాధాన్యముగల ఏ ఒక్కరితోను సంప్రదించినట్లు లేదు. పైన చెప్పిన సమావేశములో ముస్లింలకు కాంగ్రెస్‌తో సరిమానముగ ప్రాతినిధ్యము ఇచ్చుటకు శ్రీ దేశాయి అంగాకరించి ఈ ప్రతిపాదన అధారముగ సమావేశమును ఏర్పాటు చేయవలసినదిగా వైస్రాయిని కోరినానడు. ఆనాడు వైస్రాయిగా నుండిన లార్డువేవెల్‌ సంయుక్తముగ ప్రతిపాదించిన ఈ కోరిక తనకు చేరగనే విమానములో లండనుకు పోయి అట్టి సమావేశమును ఏర్పాటు చేయుటకు కార్మిక పక్ష ప్రభుత్వము అనుమతి పొంది తిరిగి వచ్చినాడు. దీని విషయమై కాంగ్రెసుకు భాగస్వామ్యము గల అధికారిక ప్రకటన జాతీయతకు, ప్రజాస్వామ్యమునకు చేసిన ద్రోహము చూసి దేశము దేశమంతా నిర్ఘాంతపోయింది. భారత ప్రజాస్వామ్యము వెన్నుపోటు పొడవబడినది.

(మిగతా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles