గాంధీజీ రాజకీయాలు ఒక నిశిత పరిశీలన
(నిన్నటి తరువాయి)
బ్రిటిష్ వరి ప్రవేశమునకు ముందు, హిందువులు, ముస్లింలు తమ శతాబ్దముల అనుభవంతో, భారత దేశులో ముస్లింలు యజమానులుగా వుండలేరనియు, అదే విధముగ వారిని తరిమివేయుట సాధ్యము కాదనియు గ్రహించినారు. ఇద్దరూ ఇచ్చట ఉండడం తప్పని సరియని ఇద్దరు కూడా ఆర్థం చేసుకొనినారు. మహారాష్రుల విజృంభణము వలన, రసపుత్రుల తిరుగుబాటు వలన, శిక్కుల ధాటి వలన దేశముపై ముస్లింల పట్టు సన్నగిల్లి బలహీనమైనది. వారిలో కొందరు తమ ఆధిపత్యమునకై ఆర్రులు చాచుచుండినను, వాస్తవ పరిస్థితులను ఆర్థము చేసుకొనిన వారు మాత్రము అట్టి ఆశలు ఆడియాసలని, వ్యర్దములని స్పష్టముగ చూడగల్గినారు. కాని ఇంకొవకైపు బ్రిటీష్ వారు అటు యుద్దక్షేత్రములలలో ను ఇటు దుష్ట పన్నాగములలోను హిందువులు, ముస్లింలు, ఇరువురికన్న ఆధికులమని రుజువు చేసికొనినారు. అంతేకాదు, తమ మేలైన పరిపాలనా పద్ధతులను ప్రవేశపెట్టుట వలన, వివక్ష లేకండా జీవనమునకు ఆస్థులకు రక్షణ కల్పించెదమని నమ్మకం కల్గించడం వలన హిందువులు, ముస్లింలు కూడా వారి ప్రవేశం తప్పని సరియని అంగీకరించినారు.
అట్లయినప్పటికీ, బ్రిటీషు వారి నీతి నియమములు లేని పద్దతులలో ఉన్న విభేదములను సృష్టించినారు. దేశ ప్రభుత్వములో, దేశ ప్రజలకు అధికారములను సంపాదదించుట ద్యేయముగ నేర్పరుపబడిన భారత జాతీయ కాంగ్రెసు, ప్రారంభం నుండి భారతీయులందరు ప్రజాస్వామ్యము ప్రాతిపదికగా సమాన హక్కులను సంపూర్ణ సమానత్వమును అనుభవించుకోవలెననే ఆదర్శమును తన ముందు వుంచుకొనినది. నా ప్రజా జీవితములో మొట్టమొదటి నుండి కూడా విదేశీ సాలనను తొలిగించి, దాని స్థానములో ప్రజాస్వామ్యశక్తిని, ప్రనజల ఆధిపత్యమును ఏర్పరచడం అనే భావన నాకు చాల నచ్చిన విషయము.
వ్రాతలలోను, ఉపన్యాసములలోను దేశముయొక్క ప్రజా వ్యవహారముల నుండి శాసన సభలకు లోపల జరుగు ఎన్నికల నుండి మంత్రివర్గముల నిర్మంచుట, తొలగించుట వంటి వాటి నుండి కులమతపరమైన భావములను దూరముగ వుంచవలెనని నేను వాదించుచుండెడివాడను. సంయుక్త నియోజకవర్గములతో మత ప్రమేయములేని రాజ్యమను నేను ఎల్లప్పుడు బలపరచెడి వాడను. నేను నమ్మినంత వరకు అదియే వివేకవంతమైన పద్ధతి. కాంగ్రెసు ్పఆబల్యము వలన హిందువులలో ఈ ఆదర్శము క్రమముగ పాదుకొని పోవుచుండినది. కాని ముస్లింలు ఒక ప్రత్యేక వర్గముగ మొదట మొదట దూర దూరముగ వుంటూ వుండి తదుపరి విదేశీ ప్రభువుల విభజించి పాలించు తంత్ర ప్రభావమునకు క్రమక్రమముగ లోబడి హిందువులను తమ ప్రాబల్యములో వుంచుకనవలెననే దురాశను పెంపొందించుకన సాగినారు.
1906లో అప్పటి వైప్రాయి లార్డు మొటోనే ప్రోతాసహింపబడి ప్రత్యేక నియోజక వర్గములను కోరడరం ఈ దృక్పథానికి ప్రథమ తార్కాణం. అల్ప సంఖ్యాకుల రక్షణ అనే మిషపై బ్రిటీష్ ప్రభుత్వం ఈ కోర్కెను అంగీకరించింది. కాంగ్రెసు పార్టీ కాగితము మీద దీనికి ఆక్షేపణ తెలిసినప్పటికి క్రమేపీ విడిపోవు ధోరణులను బలపరచుచుండి 1934లో దానిని అంగీకరించము నిరాకరించము’ అనే అప్రతిష్టకరమైన తీర్మానము చేసినది.
ఆ విధముగ దేశ విభజన కోరిక మొలక ఎత్తి క్రమ క్రమాభివృద్ధి నొందినది. మొదట సన్న పగులుగా కనబడినది తుదరకు పాకిస్థాన్‌గా రూపొందినది. మొట్టమొదట ఈ పొరబాటు విదేశీయులను తరిమివేయుటకు భారతదేశములోని అన్ని వర్గములను ఐక్యపక్షముగ ఏర్పరచుటకు అనే దుద్శేశ్యముతో చేయబడినది. ఈ వేర్పాటుధోరణులు క్రమేపి అంతర్దానమగునని భావించపబడినది.
(ఇంకావుంది)
