తల్లిదండ్రులకు శాపం.. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం..
(తెలంగాణ సామ్నా బ్యూరో)
(నిన్నటి తరువాయి)
డాక్టర్ గ్రామానికి వచ్చినా కూడా ఆర్థం కాని పరిస్థితి ఎర్పడిOది. భార్యకు చెబుదామని అనుకున్న ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో ఆర్థం కాని పరిస్థితి తలెత్తింది. కూతురు తమతో కాకుండా ఎవరితో ఫోన్లో మాట్లాడిOది? అని తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పదవతరగతిలో కూతురు స్నేహితురాళ్లను కలిశాడు. అందులో ఒక అమ్మాయి మటుకు ‘‘అంకుల్ మీ కూతురు స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఆటో డ్రైవర్‌తో చనువుగా వుండేడిది. మేమందరం వెనక కూర్చుంటే మీ కూతుర్ని మటుకు డ్రైవర్ పక్క సీటులో కూర్చోమనేవాడు. మీ కూతురు కూడా కూర్చునేది’’ అని చెప్పింది. వారిద్ధరికి తొమ్మిదవ తరగతి నుండి దోస్తానా వుందని కూడా చెప్పింది. దీనితో డాక్టర్‌కు కొంచెం విషయం ఆర్థం అయ్యింది. ఏ విషయం అనేది తేలకపోతే తాను తన కుటుంబ పరువు మర్యాద గంగలో కలుస్తాయని డాక్టర్‌కు పక్కాగా ఆర్థం అయ్యింది. అందుకే ఓపికగా పూర్తి సమాచారం కొరకు ప్రయత్నం చేయసాగాడు. ఆటో డ్రైవర్ స్నేహితులను ఒక్కొక్కరిని కలిసి ఆ డ్రైవర్ గురించి ఆరా తీశాడు. కొందరేమో తమకు ఏమీ తెలియదని చెప్పగా ఒకరిద్ధరు మటుకు మీ అమ్మాయిని ఫటాయించిన అని మాతోటి ఒకసారి తాగినప్పుడు చెప్పినాడు అని చెప్పినారు. ఆ మాట వినగానే ఆ డాక్టర్ కాళ్లకింద భూమి పగిలి తాను అందులో శాశ్వతంగా కూరుకుపోతే బాగుండని అనిపించిందేమో? ఇక ఒక్క క్షణం అక్కడ వుండలేదు. ఇక తప్పదని విషయం భార్యకు చెప్పాడు. భార్య గొల్లుమంది. ఏడుస్తున్న భార్యను ఓదార్చాడు. ఎక్కడ ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూతురు భవిష్యత్తుతో పాటుగా తమ పరువు మర్యాదలు నాశనం అవుతాయని సర్ధిచెప్పాడు.
ఇక తమ కూతురు డాక్టరు అవ్వడం కల్ల అని ఆ డాక్టరు తండ్రికి ఆర్థం అయ్యింది. ఎంతెంతగా తమకు దూరంగా వుంటే అంతంతగా ఆటోడ్రైవర్‌కు దగ్గరయ్యే పరిస్థితి కనబడిOది. అందుకే తన కూతురును డాక్టరుగా చూడకపోయిన కనీసం ఓ కూతురుగానైనా వుండాలని అనుకున్నాడు. కాలేజీలో వుంచితే చదువు సంగతి పక్కనబెట్టి ప్రేమ వ్యవహరాలు ఫోన్లో విపరీతంగా పెరిగిపోయి కూతురు జీవితం ఎటు వెళ్తుందో అని భయం పట్టుకుంది. ఇక తప్పనిసరి పరిస్థితిలో కూతురును ఇంటికి తీసుకొచ్చి కొంతకాలం అయ్యాకా పెళ్లి చేయడం తప్ప వేరే మార్గం లేదని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాడు. కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌తో నాభార్య బిడ్డమీద బెంగ పెట్టుకుంది. తీసుకెళ్తా అని చెప్పాడు. రెండు సంవత్సరాల ఫీజు చెల్లించాడు. అమ్మ ఆరోగ్యం బాగాలేదని నిన్నే కలవరిస్తుందిని చెప్పాడు. కూతురును తీసుకొని ఇంటికి వచ్చేశాడు.
ఇంటికి వచ్చాకా కొద్ధిరోజులకు కూతురుకు ఆర్థం అయ్యింది. తన ప్రేమ వ్యవహరం తెలిసే నాన్న తనకు ఇంటికి తీసుకువచ్చాడని తెలుసుకున్నాకా కూతురుకు ఏం చేయాలో ఆర్థం కాలేదు. తన తోటి స్నేహితులు హయిగా ఆడుకుంటూ పాడుకుంటూ, ఇంట్లో అమ్మనాన్నలకు సహయం చేస్తూ రోజు కాలేజికి తన కళ్లముందే వెళుతు వస్తుంటే ఆ కూతురు మటుకు ఇంట్లో కూర్చోని ఒక్కతే మౌనంగా వుండిపోతోంది. తండ్రితో భయంతో కూడా మాట్లాడలేని పరిస్థితి, తల్లిని ప్రేమతో పలకరించలేని దుస్థితి, తమ్మునితో బుజ్జగింపుతో బెదిరించలేని పరిస్థితి ఆ కూతురుకు ఏర్పడిOది. స్నేహితులు లేరు, అంతేకాదు. ఇంట్లో కూడా ఎవ్వరు మాట్లాడడానికి లేరు. ఓ మూగదయ్యంలా ఓ మూలకు పడుండడం, అమ్మ కూరగాయలు కోసివ్వమనో, చాయి పెట్టమనో చెబితే మౌనంగా వెళ్లి ఆ పనులు చేయడం, తినడం, టివీ చూడడం మినహా చేసే పనులు ఏమీ లేవు. బయటకు వెళ్లేది లేదు. వెళ్తానన్న పంపించేవారు లేరు.
పదహరు సంవత్సరాల వయసులోనే ఆడుతూ పాడుతూ గారాభం చేస్తూ, మారం చేస్తూ, అలుగుతూ, ఆరాధిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయాల్సిన వయసులో ఇల్లునే జైలుగా తల్లిదండ్రులు మార్చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అలా చూస్తుండగానే ఆరు నెలల కాలం గడిచింది. డాక్టరు కూతురు ఎందుకు కాలేజీకి వెళ్లడం లేదనే విషయం ఆనోటా ఈ నోటా ఊరంతా తెలిసిపోయింది. కొందరు డాక్టరును ఓదార్చారు. ధైర్యం చెప్పారు. మరికొందరు సన్నిహితులు ఇంటికి వెళ్లి కూతురుతో మాట్లాడారు. బుజ్జగించారు. వారందరికి ఆ కూతురు మౌనం, కన్నీళ్లుతోనే సమాధానం ఇచ్చింది. డాక్టరుకు కూతురు వ్యవహరం పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. ఇక లాభం లేదనుకొని దూరంలో వున్న తమ సమీప బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. చాలామంది బంధువులు కనీసం మైనార్టీ తీరకుండా పెళ్లి ఎందుకు చేస్తున్నావురా? అని అడిగితే తన భార్య ఆరోగ్యరీత్యా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. దాదాపుగా రెండు వైపులా పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మంచిరోజులు చూసి పెళ్లి నిశ్చయం చేసుకుందామని అనుకున్నారు.
ప్రతిరోజులాగే ఆ రోజు తెల్లారింది. కాని రోజు ఆ సమయానికి పడుకుంటు కనిపించాల్సిన కూతరు డాక్టరుకు కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు. మెయిన్ గేట్ తీసివుంది. డాక్టర్‌కు విషయం ఆర్థమయ్యింది. హుటాహుటిన ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లాడు. వారు కూడా కొడుకు కోసం వెతుకుతున్నారు. డాక్టర్‌కు విషయం ఆర్థం అయ్యింది. ఇంతకాలం తనలో తాను దాచుకున్న రహాస్యం బట్టబయలైంది. తన పరువు, మర్యాద అన్ని కూతురు వల్ల బూడిద పాలయ్యాయి అని తెలిసిపోయంది. ఇక చేసేది ఏమీ లేదు. ఇపుడు కూతురును ఇంటికి తీసుకువచ్చినా పోయిన పరువు మటుకు తీసుకురాలేను అని ఆర్థమయ్యింది.గ్రామంలో వుండే ఆత్మీయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమంటే చేశాడు. ఇంటికి వచ్చి గుండె బరువు దిగేంత వరకు భార్యను దగ్గరికి తీసుకొని ఏడ్చాడు. ఆ తరువాత ధైర్యంగా తనకు కూతురు పుట్టలేదని ఒక్కడే కొడుకు వున్నాడని నిశ్చిత అభిప్రాయానికి వచ్చాడు.
కాలం మరో రెండు సంవత్సరాల్ని నెట్టేసింది. భార్య మానసికంగా కృంగిపోయి ఆరోగ్యం దెబ్బతింది. డాక్టరు కూడా హుషారుగా పని చేసుకోవడం లేదు. జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చే కొందరు ఆటో డ్రైవర్ కనిపించాడు. బహుశ నీ కూతురు ఆ ఊర్లోనే వుంటుంది కదా! అని చెప్పినా పట్టించకోలేదు. కూతురు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిరు ఉద్యోగం చేస్తుందని చెప్పినా చెవికి ఎక్కించుకోలేదు. తన పని తాను చేసుకుంటు బ్రతుకీడుస్తున్నాడు ఆ డాక్టరు.
కూతురైనా కొడుకైనా తల్లిదండ్రులు వారి కోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం వుందన్న వాదనలు వస్తున్నాయి. తమ సంతానంతో ఒక స్నేహితుల్లా మెలాగాల్సి అవసరం వుందన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. సంపాదన యావలో పడి పిల్లలను పట్టించుకోక ఆ తరువాత తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడుస్తే అంతో ఇంతో ఓదార్పు లభిస్తుందేమో కాని లాభం ఏమీ వుండదు. పిల్లల కదలికలపై అప్రమత్తత చాలా అవసరం అనే వాదనకు బలం చేకూరుతుంది. పిల్లలను నిర్భందించినట్లుగా కాకుండా సమాజంలో జరుగుతున్న చెడు గురించి చెడు వ్యసనాల గురించి లోకం తీరు వాటి తాలుకూ ప్రభావం గురించి తల్లిదండ్రులే పిల్లలతో చర్చించి వారిని సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిల్లలు కూడా తల్లిదండ్రులు కష్టపడేది, సంపాదించేది ఉన్నత విద్యను అందించేది తమ భవిష్యత్తు కోసమే అనే భావనను మరవరాదు. అలాగే సమాజంలో చెడును ప్రోత్సాహించే వ్యవస్థలను గమనించాల్సిన అవసరం వుంది. కొందరు స్నేహితులు లేదా స్నేహితురాళ్లు ఉద్ధేశ్యపూర్వకంగా చెడగొట్టడానికి చేసే ప్రయత్నాలను గమనించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
