(నిన్నటి తరువాయి)
మోస్లా తిరుగుబాటు:
మలబారు, పంజాబు, బెంగాల్, వాయువ్య సరిహద్దు ప్రాంతములు పదే పదే జరిగిన అత్యాచాలకు అనువైన స్థలములైనవి. మోస్లా తిరుగుబాటు ఆ విధంగా అది పిలువబడిరది. దీర్ఘకాలం సంఘటితంగా హిందూమతం పైన, హిందు గైరవం పైన, హిందు జీవితాలపైన, హిందూ ఆస్థులపైన జరుపబడిన దాడి వందలకొలది హిందువులు బలవంతముగా మతం మార్పిడి చేయబడినారు. స్త్రీలపై అత్యాచారాములు జరుపబడినవి. తన మతపరమైన విధానము వలన భారతదేశానికి ఈ దురదృష్టాన్ని ప్రసాదించిన మహాత్ముడు నోరు విప్పకుండా వుండినాడు. ఈ దౌర్జన్యకారులను నిందించుచు తాను ఒక్కమాటైనా అనలేదు సరికదా, ముందు ముందు తిరిగి అటువంటి అత్పాచరాములు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొనుటకు కాంగ్రెసు చేయు ప్రయత్నములను కొనసాగనీయలేదు. అంతటితో పోకుండా మలబారులో అనేక బలవంతపు మత మార్పిడులు జరిగినవి. ఆసత్యమున్నంత వరకు దిగజారి ఒకే ఒక్క సందర్భములో బలవంతపు మతపు మార్పిడి జరిగినట్లు తన ‘‘యంగ్ ఇండియా’’ అను పత్రికలో ప్రచురించినాడు. కాని, ఆయన ముస్లిం మిత్రలే కాయన చెప్పునది నిజముకాదనియు, మలబారులో బలవంతపు మత మార్పిడీలు ఎక్కువ సంఖ్యలోనే జరిగినవనియు తెలిపినారు. ఆయన తన అసత్యమైన ప్రకటనను సరిదిద్దుకొనక పోవుటయేగాక హిందూ బాధితుల కొరకుగాక, మోస్లా ముస్లింల కొరకై ఒక ప్రత్యేక నహాయనిధి సేకణ ప్రారంభించేటంతటి అపహాస్యమైన పనికి పూనుకొనినాడు. ఇంతచేసినా, హిందూ ముస్లిం ఐక్యత నెలకొన్న ఆదర్శ ప్రదేశము కనుచూపు మేరలోకి కూడా రాలేదు.
ఆఫ్ఘను ఆమీరు కుట్ర:
ఖిలాఫత్ ఉద్యమము విఫలమై పోగానే ఖిలాఫత్ భావాలను ఏలాగో ఒకలాగు సజీవంగా వుండేటట్టు చేయుటకు ఏదో ఒకటి చేయవలెనని ఆలీ సోదరులు నిర్ణయించుకున్నారు. అందుకై వారు ఒక కొత్త నినాదాన్ని లేవదీసినారు. అదేమిటంటే, ఖిలాఫత్‌కు శత్రువు ఇంస్లాంకే శత్రువు అని. అందువలన టర్కీలో సుల్తానును ఓడిరచి పదవీభ్రష్టుడిని చేయుటలో బ్రిటిష్‌వారు ప్రధానమైన బాధ్యులు కావున విశ్వాసముగల ప్రతి ముస్లిం, తన విశ్వాసమునకు కట్టుబడి బ్రిటిష్‌వారు ప్రధానమైన బాధ్యులు కావున విశ్వాసముగల ప్రతి ముస్లిం, తన విశ్వాసమునకు కట్టుబడి బ్రిటిష్‌వారికి బద్ధశత్రువు కావలసియున్నది. ఈ లక్ష్యముతో, భారతదేశముపైసకి దండెత్తి రమ్మని ఆఫ్ఘన్ ఆమీరును వారు ఆహ్వానించుచు, ఒక కుట్రపన్ని అతనికి తమ పూర్తి సహాకారమును వాగ్ధానము చేసినారు. ఈ పన్నాగము వెనుక దీర్ఘమైన చరిత్రే యున్నది. ఈ కుట్రలో తమకు భాగము వున్నదనే విషయమును ఆలీ సోదరులు ఎప్పుడూ కాదనలేదు. మహాత్ముడేమీ మంచికైనా చెడ్డకైనా ఆలీ సోదరులను బలపరుసూ హిందూ ముస్లిం ఐక్యతను సాధించేందుకు తన ఎత్తు గడలను సాగిస్తూనే వుండినాడు.
(ఇంకా వుంది)
