
తెలంగాణ సామ్నా బ్యూరో: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో ముక్కుపచ్చలారని ఓ ఐదు సంవత్సరాల బాలికపై పక్కింట్లో వుండే ఓ వైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సభ్యసమాజం సిగ్గుతో, అవమానంతో తలదించుకునే ఈ సంఘటన గురించి తెలిసిన వారు బాధతో నోరు వెళ్లబెడుతున్నారు. బాలిక తలను కనీసం మూడు సార్లు గోడకేసి కొట్టినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా ముఖంపై ఒంటిపై పంటి గాయాలు వున్నట్లు చెబుతున్నారు. చెప్పడానికి, రాయడానికి సాధ్యంకాని అమ్మాయి శరీరభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 28 కుట్లు డాక్టర్లు వేశారు. శరీరం లోపల గాయాల కారణంగా కొలోస్టమీ సర్జరీని డాక్టర్లు చేశారు. అత్యంత నీచంగా, దారుణంగా ఓ మైనర్ బాలుడు పాలబుగ్గల పసిదానిపై చిత్రహింసల అత్యాచారం చేసిన ఘటన మానవ సమాజానికి అత్యంత నీచమైన రోజుగా చెప్పవచ్చు.
ఆడవిలో నెమలిలా ఆడుకుంటూ అమ్మనాన్నలతో సోదరి సోదరులతో ఏ కల్మషం లేకుండా తిరుగాల్సిన వయసులో ఓ రాక్షసుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఆ బాలిక జీవితాన్ని నాశనం చేయడం అత్యంత హేయనీయమనే విమర్శ వస్తున్నది. ఈ అత్యాచారం ఓ కామపిచ్చి పట్టిన కుర్రాడు చేసినా, ఈ పాపం ఆ మూర్ఖుని తల్లిదండ్రులకు కూడా తగులుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసియూలో చావుబ్రతుకుల మధ్యన ఊగిసలాడుతు చికిత్స పొందుతుంది. ఆ రాక్షసున్ని అరెస్ట్ చేశారు. వాన్నే కాదు. కొడుకును అలా పెంచిన కుటుంబ సభ్యుల్ని కూడా వానితో పాటుగా అరెస్ట్ చేయాలనే డిమాండ్ వస్తున్నది.
