(నిన్నటి తరువాయి)
వారిపై తనకుగల అభిమానాన్ని బహిరంగముగ కుమ్మరిస్తు ఖిలాఫత్ పురరుద్దరణకు తన సంపూర్ణ సహకారమును ప్రకటించినాడు. అఫ్ఘన్ ఆమీరు దండయాత్ర విషయములలో కూడా మహాత్మా ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆలీ సోదరులను బలపరుస్తూ వుండినాడు. ఈ విషయము సందేహము లేకుండా రుజువు కాబడినది. కీర్తిశేషులైన శాస్త్రి, సివై చింతామణిలు ఆయన జీవిత పర్యంతం మిత్రుడిగా నుండిన వారు ఆయన ఉపన్యాసములు, వ్రాతలు. ఆమీరును భారతదేశంపై దండెత్తమని అలీ సోదరుల ఆహ్వానానికి ఖచ్చితంగా మద్దతు ఇచ్చినట్లే వున్నవని స్పష్టముగా చెప్పినారు. ఆ రోజులలో మమాత్మా వ్రాతల నుండి ఉదాహరింపబడిన ఈ క్రింది భాగములు ముస్లిములను సంతృప్తిపరచవలెనే పేరాశతో ఆయన తన దేశమును కూడా మరచిపోయి తన మాతృదేశము మీదికి విదేశీ పాలకున్ని దండెత్తి రమ్మని ఇచ్చిన ఆహ్వానమునకు భాగస్వామి అయినాడు. ఈ క్రింది మాటలలో మహాత్ముడు ఆ దండయాత్రను సమర్ధించినారు.
‘‘అలీ సోదరులు ఎందుకు నిర్భంధింపడబోతున్నారో పుకార్లు ఆ విధంగా వున్నవి. నే ఎందుకు స్వేచ్ఛగా వుంచబడతానో నాకు ఆర్థం కావడం లేదు. నేను చేయని కార్యాన్ని దేనినీ వారు చేయలేదు. ఆమీరుకు వారేదైనా సందేశం పంపి వుంటే ఆయన (అమీరు) వస్తే అతనికి వెనకకు తరముటలో భారతీయుడు ప్రభుత్వానికి సహాయము చేయకుండా నేను చేయకలిగినదంతా చేస్తానని నేను కూడా ఆమీరుకు ఒక సందేశము పంపుతాను’’ బ్రిటిష్‌వారి జాగరూకత ఈ కుట్రను భగ్నం చేసింది. అలీ సోదరుల పరిహాసాస్పదమైన భారతదేశముపై దండయాత్ర పన్నాగము ఏమీ పారలేదు. ఇక హిందూ ముస్లిం ఐక్యత ఇంతకుముందు ఎంత దూరములో వుండినదో ఇప్పుడు గూడ అంతే దూరములో వుండిపోయినది.
ఆర్యసమాజముపై దాడి:
1924లో గాంధీజీ అకారణంగా, తన యోగ్యతకు తగని విధంగా ఆర్యసమాజమును తీవ్రముగా విమర్శించి తనకు ముస్లింలపై వున్న ప్రేమను పెద్ద బడాయిగా ప్రదర్శించుకొనినాడు. ఆర్యసమాజము ఏదో పాపము చేసినట్లు దానిని బహిరంగముగా నిందించినాడు. ఇది నాష్కారణంగా, నిర్లక్ష్యంగా, అవమానకరముగా చేయబడిన నింద. కానీ మహమ్మదీయులకు సంప్రీతిగా వుండేదదైనా సరే గాంధీజీ హృదయానికి అత్యంత ప్రీతిపాత్రముగానే వుంటుంది. ఆర్యసమాజము కూడా గట్టిగానే ఐతే మర్యాదగా గాంధదీజీకి ప్రత్యుత్తరము ఇచ్చింది. కాని పెరుగుతుండిన గాంధీజీ పలుకుబడి వలన ఆర్యసమాజము బలహీనపడినది. స్వామీ దయానంద అనుయాయులెవ్వరు రాజకీయములలో గాంధీ కాంగ్రెసులో వుండడానికే వీలు లేకుండినది. ఎందువల్లనంటే వాటి రెంటికి ఎక్కడ పొంతనే లేదు.ఐతే నాయకత్వం అధికారం సంపాదంచుకోవలెననే ఆశతో వారు రెండు గుర్రముల స్వారీ చేస్తూ అటు గాంధీజీ కాంగ్రెసువారమని, ఇటు ఆర్యసమాజీయులమని కూడా చెప్పుకొసాగినారు.
దీని ఫలితం ఏమిటంటే, నాలుగు సంవత్సరముల క్రితం సింధురాష్ట్ర ప్రభుత్వం సత్యార్ధ్య ప్రకాష్‌పై నిషేధం విధిస్తే ఆర్యసమాజ్ దానిని గూర్చి నోరైనా మెదపలేదు. ఇందువలన హిందువుల సామాజిక, మతపరమైన జీవనంపై ఆర్యసమాజపు పలుకుబడి ఇంకా పలుచనైపోయింది. ఆర్యసమాజ సభ్యులు వ్యక్తిగతంగా గట్టి జాతీయవాదులుగా వుండిపోయినారు. ఉన్నారు కూడా. ఉదాహరణకు రెండుపేర్లు చెప్పాలంటే, స్వర్గీయ లాలాలజపతిరాయ్, స్వామి శద్ధానంద గట్టి ఆర్యసమాజవాదులే గాకుండా, వారి జీవితాంతం వరకు కాంగ్రెసు నాయకులలో అగ్రగాములుగానే వుండినారు. వారు మాత్రం గాంధీజీని గ్రుడ్డిగా సమర్థించలేదు. అంతేకాదు. వారు ఆయన ముస్లిం పక్షపాత ధోరణినిన విమర్శించడమేగాదు గట్టిగా పోట్లాడినారు కూడా. కానీ ఈ మహనీయులు గతించిపోయినారు. ఆర్యసమాజములోని ఎక్కువభాగము ఎప్పుడు వున్నట్లే వున్నారు. కాని విషయజ్ఞానము సరిగా లేని వీరు సమాజములోని ఒక స్వార్థపూరిత ముఠాచే నడుపబడుచున్నారు. అందుచే ఆర్యసమాజము ఒకనాడు కల్గియుండిన శక్తిని, అధిపత్యాన్ని కోల్పోయినది.
(ఇంకా వుంది)
