(నిన్నటి తరువాయి)
పదవీ స్వీకరణము అలుకతో నిష్క్రమణము:
1935 భారత ప్రభుత్వ చట్టము క్రింద రాష్ట్ర స్వపరిపాలనము 1937 ఏప్రిల్ 1వ దేతా నుండి ప్రవేశపెట్టబడినది. ఈ చట్టము నిండా రక్షణలు, ప్రత్యేక అధికారములు, వివిధ శాఖలలో పనిచేయు బ్రిటిష్ అధికారులకు రక్షణలు కల్పించబడియున్నవి. అందువలన కాంగ్రెసు మొదట పదవీ స్వీకరణకు తటపటాయించింది. కానీ త్వరలోనే ప్రతి రాష్ట్రములోను మంత్రి వర్గములు ఏర్పరుచబడడం, అందులో ఐదు రాష్ట్రములలో ఏలాంటి ఇబ్బంది లేకుండా అవి పనిచేసుకొని పోతూ పుండటం కాంగ్రెసు పార్టీ గమనించింది. మిగితా ఐదు రాష్ట్రములలో కూడా మంత్రి వర్గములు తమ బలము అల్ప సంఖ్యలో వున్నా జాతి నిర్మాణ కార్యక్రమములో పురోగమిస్తూనే వుండినవి.
ఇట్టి పరిస్తితులలో తాము ప్రయోజన శూన్యమైన సహాయ నారాకరణ విధానమును కొనసాగించినట్లయితే, తమను గురించి పట్టించుకునేవారు లేరు. లేక, ప్రజల దృష్టి నుండి దూరమైపోతామనే భావము కాంగ్రెసుకు కల్గింది. అందువలన 1937 జూలైలో అధికార స్వీకరణకు అంగీకరించుటకు నిర్ణయించుకొన్నది. అట్లా చేయడంలో తమ మంత్రి మండలులలో ముస్లింలీగుకు ప్రాతినిధ్యం లేకుండా చేసి తీవ్రమైన పొరపాటు చేసింది. తమ మంత్రివర్గములలో కాంగ్రెసులో సభ్యులైన ముస్లింలను మాత్రమే చేర్చుకొనినది. పౌరులందరికి ఒకే విధమైన నియోజక వర్గములుండి మత పరమై ప్రాతినిధ్యము లేని దేశములలో ఇది సరిఅయిన పద్ధతి. కానీ మతపరమైన నియోజకవర్గాలను మత పరమైన అన్ని విధానాలను అంగీకరించి తాము అల్ప సంఖ్యాకులుగా నున్న ప్రతి రాష్ట్రంలోను ముస్లిం జన బాహుళ్యానికి ప్రతినిధులుగా ఎన్నికైన ముస్లింలీగును దూరంగా వుంచడం అర్థంలేని పని. మంత్రులుగా తీసుకోబడిన జాతీయ ముస్లింలు, ముస్లింలీగు ముస్లింలవలె ముస్లిం జన బాహుళ్యానికి ప్రతినిధులు కానందున, కాంగ్రెసు ఒక వర్గపు మంత్రి మండలుల నియమించుకొని, తాను ఏది కాదని చెప్పుకొనుచుండినదో, అట్టి ఏకవర్గ పక్షముగా ప్రభుత్వ చట్టము కిందనే అంగీకరించినది.
ఇక ముస్లింలంటారా? వారిని అప్యాయతతతో చూసుకొనే బ్రిటిష్ గవర్నర్లు వుండనే వున్నారు. కాబట్టి ఈ కాంగ్రెసు మంత్రుల ఆదరాభిమానములు, రక్షణలు ఏ మాత్రము అవసరము లేదని భావించారు. ఈ పరిస్థితి రాజకీయ ఎత్తుగడలకు జిన్నాకు పూర్తిగా అనుకూలమైనది. ఈ అనుకూలతను1939లో కాంగ్రెసు బ్రిటిష్ వారిపై అలిగి పదవీ పరిత్యాగము చేసినప్పుడు జిన్నా పూర్తిగా వినియోగించుకొనినాడు. 1935 భారత చట్టములో 93వ సెక్షను కింద కాంగ్రెసు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను గవర్నర్లు స్వాధీనము చేసుకోగా, ఇతర రాష్ట్రాలలో ముస్లిం మంత్రివర్గాలు పదవిలో కొనసాగినవి. ముస్లిం పక్షపాతులైన గవర్నర్లతో కొన్ని రాష్ట్రములలోను ముస్లిం మంత్రివర్గములతో ఇతర రాష్ట్రములోను మతతత్వం దేశమంతటా రెచ్చగొట్టబడిరది. గాంధీజీ హిందూ ముస్లిం ఐక్యత అనేది ఒట్టి కలగా మారిపోయింది. అయితే గాంధీజీ మాత్రం ఇదంతా ఏమీ లెక్కచేయక తన ధోరణిలో తాను వుండిపోయినాడు. ఆయన ఆశ అంతా హిందువులకు ముస్లింలకు కలసి ఏకైక నాయకుడు కావడం, మంత్రివర్గముల నుండి నిష్క్రమించి కాంగ్రెసు మరియొకసారి ప్రజాస్వామ్యాన్ని జాతీయతను త్యాగం చేసింది. మహాత్ముని మూర్ఖపు పట్టుదల అనే బలిపీఠము ముందు హిందువుల మత రాజకీయ ఆర్థిక సామాజిక ప్రాథమిక హక్కులు బలిచేయబడినాయి.
(మిగతా రేపు)
