23.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

(నిన్నటి తరువాయి)


వందేమాతరం గీతమును పాడరాదుÑ ముస్లింలు యెడ గాంధీజీ వ్యామోహము ముస్లిం నాయకత్వమునకై తీవ్రమైన కాంక్ష వీటి సాధనకై హిందువుల నమ్మకముపై తిరస్కార భావముతో తప్పొప్పులను గాని, సత్యము, న్యాయములనుగాని, లెక్కచేయక పోవుట మహాత్మా యొక్క ఉదారత్వమునకు పరాకాష్ఠ అయినది. ఇంకొక అప్రతిష్టాకరమైన విషయము, ప్రసిద్ధి చెందిన ‘‘వందేమాతరం’’ గీతమును కొందరు ముస్లింలకు నచ్చతేదనే మిషమై తనకు వీలైన చోట్లలో మహాత్మా ఆ పాటను పాడడం తక్షణమే నిలిపివేయడం. ఈ గీతమొక శతాబ్దముగా గౌరవ స్థానమును కల్గి బెంగాలీలను తమ జాతి సేవకై ఒక్క మనిషిగా లేచి నిలబడుటకు ఉత్తేజనరచినది. 1905 వంగ విభజన వ్యతిరేక ఉద్యమములో ఈ గీతము ప్రత్యేకమైన ప్రాముఖ్యము, జనాదరణ పొందినది. ఈ పాట గానము చేయబడిన లెక్కలేనన్ని సభలలో బెంగాలీలు ఈ పాటపై ప్రమాణము చేసి తమను తాము మాతృదేశమునకే అంకితము చేసుకొనినారు.

‘‘మాతృభూమి! నీకు వందనము’’ అనే సామాన్యమైన ఆర్థము గ్రహించలేక నలబై సంవత్సరముల క్రితం బ్రిటిష్‌ పాలకులు ఈ పాటను కొంతకాలము నిషేదించినారు. అందువలన ఈ పాట దేశమంతటి మరింత ప్రజాదరణ పొందినది. కాంగ్రెసు ఇతర జాతీయ సమావేశములలో ఈ పాట పాడటం కొనసాగుతూనే వుండినది. కాని ఎప్పుడైతే ఒక్క ముస్లిం దీనికి అక్షేపణ తెలిపినాడో ఆ క్షణం ఆ పాటపై జాతికి గల గౌరవ భావములను కూడా లెక్కచేయకుండా గాంధీజీ దానిని జాతీయ గీతముగా పాడుటకై పట్టుబట్టకుండా కాంగ్రెసును ఒప్పించినాడు. ఇప్పుడు ‘‘వందేమాతరం’’కు బదులుగా రబీంద్రనాథ్‌ టాగోరు వ్రాసిన ‘‘జనగణమన’’ ను స్వీకరించమని మనకు చెప్పినాడు. ప్రపంచ వ్యాప్తముగా కీర్తి గడిరచిన ఈ గీతము యెడ జరిపిన ఈ సిగ్గుమాలిన చర్యను మించి మనోవైకల్యమను కల్గించు దయనీయమైన చర్య మరొకటి వుంటుందా? తెలియని వారికి తెలియజెప్పి దుర్భమలను తొలగించడం అచరించదగిన సరిఅయిన పద్దతి. కాని ముప్పయి సంవత్సరములలో అంతులేని ప్రజాభిమానము ఎదురులేని నాయకత్వము కలిగియుండి కూడా గాంధీజీ ఈ సరిఅయిన పద్దతిని అనుసరించుటకు తగిన ధైర్యమును సమకూర్చుకొనలేకపోయినాడు. ఆయన గారి హిందూ ముస్లిం ఐకమత్యము అను తలంపుకు అర్ధమేమిటంటే, లొంగిపోవడం, ఓడిపోవడం, ముస్లింలు కోరిన దానినంతా ఇచ్చివేయడం అని మాత్రమే! ఈ కొరివి దయ్యపు ఐకమత్యము ఏర్పడలేదు. ఏర్పడి వుండడానికి వీలులేదు అంటే అశ్యర్యపడవలసినదేమీ లేదు.

శివభవాని నిషేధింపబడిOది:


శివాజీ యొక్క అమేయమైన శక్తిని హిందూ జనతకు హిందూ ధర్మమునకు ఆయన కల్పించిన రక్షణను స్తుతించుచూ ఒక హిందు కవి వ్రాసిన 52 పద్యముల సంపుటి, ‘‘శివభవాని’’ని బహిరంగముగ చదువుటను, గానము చేయటను గాంధీజీ నిషేదించినారు. శివాజీయే లేకుండా వుండిన యెడల దేశము మొత్తము ఇస్లాంలోకి మార్చబడి యుండెడిది. అని ఈ పద్య సంపుటి ఆఖరు చరణములలో చెప్పబడియున్నది.
కాశీజీ కీ కలా జాతీ మధురా మశీద్‌ హోతీ!
శివాజీ జో నహో తేతో సున్నత్‌ హోతీ సబకీ!

ఇది సమకాలీన చరిత్రలో లక్షలాది ప్రజలకు సంతోషదాయకము, సాహిత్యంలో సుందరమైన భావ సముదాయము. కానీ గాంధీజీకి వీటన్నిటితో ఏమీ పని లేదు. నిజగాం ఇది బలే హిందూ ముస్లిం ఐక్యతే!

(మిగతా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles