23.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీ హత్య”

కాంగ్రెస్‌తో ముస్లింలీగు తెగతెంపులు:


(నిన్నటి తరువాయి)
దాదాపు 70000 మంది ఉప్పు చట్టమును ధిక్కరించి జైళ్ళకు పోయినారు. కానీ త్వరలోనే కాంగ్రెసు రౌండు టేబుల్‌ సమావేశాన్ని బహిష్కరించడంతో పొరపాటు చేఇసట్లు భావించి 1931 కరాచీ కాంగ్రెసులో గాంధీజీని మాత్రము కాంగ్రెసు ప్రతినిధిగా రౌండు టేబుల్‌ సమావేశములో రెండవ సభకు పుంపుటకు నిర్ణయించినది. ఆ సమావేశపు నివేదికను చదివిన వారెవరికైనా ఆ సమావేశం పూర్తిగా విఫలమగుటకు గాంధీజీయే కారకుడని విశదమౌతుంది. ఈ సమావేశములో తీసుకొన్న నిర్ణయాలలో ఏ ఒక్కటి ప్రజాస్వామ్యానికి, జాతీయతకు ద్హోదము చేసేదిగా లేదు. అంతేగాదు. గత 24 సంవత్సరములలో భారత రాజకీయ జీవనాన్ని బీటలు వారునట్లు చేసిన మతోన్మాద, విభజన శక్తులకు బలము చేకూర్చే కమ్యూనల్‌ అవార్డు (మతముల ప్రాతిపదికన తీర్పు)ను ఇవ్వవలసినదిగా దామ్సే మెక్‌డోనాల్డ్‌ ప్రాధేయపడేంతటి దూరము కూడ పోయినాడు. ఆ విధంగా ముందు ముందు ఏర్పడనున్న పార్తమెంటులో మతపరమైన ప్రాతినిథ్యము మతపరమైన నియోజక వర్గములు ప్రత్యక్షంగాను, చెప్పుకోదగినంతగాను చోటు చేసుకొనుటకు మహాత్మా బాధ్యుడైనాడు. అందువలన దామ్సే కమ్యూనల్‌ అవార్డు ఇచ్చినపుడు మహాత్ముడు దానిని తిరస్కరించుటకు నిరాకరించుటలోను, అసెంబ్లీ సభ్యులను దానిని బల పరచనూ వద్దు, తిరస్కరించను వద్దు అని ఆదేశించుటలోను ఆశ్చర్యమేమీ లేదు.

అంతకు ముందు పదిహేను సంవత్సరములుగా దేనికైతే తాను అంతంత ప్రాణములు ఒడ్డినాడో అ మతపరమైన ఐక్యతపై గాంధీజీ తానే స్వయముగా గొడ్డలి పెట్టు పెట్టినాడు. అందువలన అల్ప సంఖ్యాకులకు రక్షణ అను మిషతో 1935 భారత ప్రభుత్వ చట్టం క్రింద మనకు అటు రాష్ట్రాలలోను ఇటు కేంద్రములోను మతపరమైన ప్రాతినిధ్యము మతపరమైన నియోజక వర్గము, ఇంకా అల్ప సంఖ్యాకులకు ముఖ్యంగా ముస్లింలకు అధిక ప్రాతినిధ్యము ఇవన్నీ చట్టపరమైన గుర్తింపు పొందుటలో ఆశ్చర్య పడవలసినదేమీ లేదు. మతపరమైన ప్రాతినిధ్యము వలన ఎన్నికైనవారు మతపరమైన పక్షపాతమును కలిగి యుందురే గాని మతతత్వమునకు, జాతీయతకు నడుమనున్న అఖాతమును తగ్గించుటలో ఏలాంటి అసక్తిని కలిగియుండరు. రాజకీయ ఆర్థిక ఆశయాల ననుసరించి పార్లమెంటరీ పక్ష నిర్మాణము ఈ కారణాల చేత అసాధ్యమైపోయినది. హిందువులు ముస్లింలు వేరు వేరు గుడారములు ఏర్పాటు చేసుకొని, ఒకరికొకరు వైరుధ్యము గల పక్షములుగ ఏర్పడి విభజనన వైపుకు పోవు వేగమును పెంచినారు. ప్రతిచోట ముస్లింలు చేయు దుర్మార్గములకు హిందువులు గురి యినారు. ప్రజలెమో ఏ విధమైన హిందూప ముస్లిం ఐక్యతా సాధనపై నిరాశావాదులు కాగా మహాత్ముడేమో తన ఫల శూన్యములైన మంత్రములను ఎల్లవేళల జపము చేస్తూనే వుండినాడు.

(మిగతా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles