నిన్నటి తరువాయి
ఆర్యసమాజముపై దాడి ముస్లింలలో గాంధీజీ పలుకుబడిని ఏ విధంగానూ పెంపొందించలేక పోయింది.దానికి బదులు అది కొద్ది నెలలలోనే స్వామి శ్రద్ధానందను హత్య చేయడానికి ముస్లిం యువకులను రెచ్చగొట్టింది. ఆర్యసమాజము అభివృద్ధి నిరోధక సంస్థ అనే ఆరోపణ పచ్పిచ అబద్దమని, అది తిరోగమనవాద సంస్థ కాకపోగా హిందూ సమాజములో సంస్కరణలకు సేనాముఖము వల నుండినదనే విషయం ప్రతి ఒక్పకరికి తెలిసినదే. గాంధీజీ జనననమునకు మారు సంవత్సరములకు ముందునుంచే ఆర్యసమాజము అస్పృశ్యతా నిర్మూలనకు నడుము కట్టుకొన్నది. విధవ పునర్వివాహమునకు జనాదరణ కల్పించినది. కుల వ్యవస్తను ఖండిరచి హిందువులే కాకుండా హిందూ సిద్ధాంంతములను పాటించదలచిన వారందరు ఒక్కటే అని ప్రభోధించినది. కొంతకాలము వరకు గాంధీజీ పూర్తి మౌనము పాటించేటట్టు చేయబడినాడు. కానీ ఆయన నాయకత్వము, ఆర్యసమాజముపై ఆయన చేసిన నిరధారమైన విమర్శలను ప్రజలు మరిచిపోయేటట్లు చేసింది. అంతేకాదు, సమాజమును కూడా చాలా వరకు బలహీనపరచినది. ఆర్యసమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతికి హింసా హింసలను గూర్చి పిచ్చి బభ్రమలు లేదు. అతని బోధనలో బల ప్రయోగము విసర్జింపబడలేదు. సరికదా నైతికంగా అవసరమైనప్పుడు ఆచరించదగినదే, అని ఆయన సిద్ధాంతము. ఆర్య సమాజనాయకులు కాంగ్రెసులో వుండడమా లేదా అని సతమతమైనారు. ఎందువల్లనంటే గాంధీజీ అన్ని సందర్భములలో అహింస అని పట్టుబడ్తే స్వామి దయానందకు ఆ విషయములో ఏలాంటి పట్టింపులేదు, కాని స్వామీజీ గతించిపోయినాడు. గాంధీజీ గ్రహాలు రాజకీయ గగనంలో పుచ్చ స్థితిలో వుండినవి.
1928 సంవత్సరమునకు జిన్నా విలువ చాల ఎత్తుకు పెరిగింది అప్పటికీప మహత్మా, జిన్నా కోరిన అన్యాయమైన, హేతు బద్ధము కాని అనేక కోరికలను భారత ప్రజాస్వామ్యానికి భారత జాతాకి హిందువులకు అపకారము జరుగునట్లుగా అంగీకరించినాడు. సింధు ప్రాంతమును బొంబాయి రాష్ట్రమునుండి విడగొట్టుటకు కూడా మహాత్ముడు అంగీకరించి అచ్చటి హిందువులను మతోన్మాదులైన ముస్లిం తోడేళ్ళపాలు చేసినాడు. సింధులో కరాచీ సుక్కూరు, షికార్పురు మొదలగు ప్రదేశములలో తీవ్రమైన మతకలహము అనేకములు జరిగి, అన్నిచోట్ల హిందువులే తీవ్ర నష్టములకు, అవమానములకు గురి అయినారు. హిందుముస్లిం ఐక్యత దృష్టి పథమునుండి మరింత మరుగైనది.
(మిగతా రేపు)
