(నిన్నటి తరువాయి)
గాంధీజీ వ్యతిరేకించినది స్వాతంత్య్ర సంగ్రామములో బల ప్రయోగమును బలపరచిన వారిని మాత్రమే కాదు. ఆయనకన్న విభిన్నమైన రాజకీయ అభిప్రాయములు కలిగినవారిని, ఆయన ప్రవచించిన సర్వరోగ నివారణ దివ్యౌషధమును స్వీకరించ నిరాకరించిన వారిని అయన తమ అసంతృప్తికి గురి చేసినారు. ఆయనతో ఏకీభవించని వారిపై చూపు అయిష్టతకు సుభాష్ చందద్రబోస్ విషయము ఒక అవమానకరమైన ఘాతుక ఉదాహరణము. నాకు తెలిసినంత వరకు గాంధదీజీ ఏనాడు సుభాష్ చంద్రబోస్‌పై విధింపబడిన ఆరు సంవత్సరముల దేశ బహిష్కారమునకు అక్షేపణ తెలుపలేదు. ఆయన స్వయముగ హింసావాదమునకు తన సానుభూతి తెలుపలేదని ప్రకటించిన తర్వాతనే బోసుకు కాంగ్రెసు అధ్యక్ష స్థానము పొందుటకు వీలు కలిగించబడినది. కార్యాచరణలో మాత్రము సుభాష్ చంద్రబోసు తన అధికార కాలములో గాంధీజీ అడుగులకు మడుగులు వత్తే పద్ధతిని అనుసరించలేదు.

అయినప్పటికీ గాంధీజీ డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెసు అధ్యక్షడు కావలెనని బహిరంగముగ అభిలషించినపుడు కూడ, డాక్టరు పట్టాభి సొంత రాష్ట్రములో సహా, అత్యంత అధిక అధిక్యతతో రెండవసారి కూడా కాంగ్రెసు అధ్యక్షుడు కాగలిగినంత జనాధరణను పొందగలిగినాడు. ఇది గాంధీజీని, సహనమును కోల్పోవునంతగా కలవరపరచినది. సుభాష్ విజయము నా ఓటమే కాని, డాక్టరు పట్టాభిది కాదు, అని గాంధీజీ తన అగ్రహమును మహాత్ముని పద్దతిలో విషపూరిత వచనములలో ప్రకటించినాడు. ఇట్టి ప్రకటన చేసిన తర్వాత కూడ సుభాష్ బోసుపై ఆయన అగ్రహము చల్లారలేదు. కేవలము మొండి పట్టుదల కారణంగానే ఆయన త్రిపుర కాంగ్రెసు సమావేశమునకు పోకుండా వుండి పూర్తిగా దురాలోచనా పూరితమైన నిరాహార దీక్ష అనే పోటీ ప్రదర్శనను రాజకోటలో ప్రదర్శించినాడు. కాంగ్రెసు గెద్దనతుండి సుభాష్‌ను తొలగద్రోయునంత వరకు గాంధీజీ విషము హరించిపోలేదు.
కాంగ్రెసు కిరీట ధాదరణకు సుభాష్ తిరిగి ఎన్నిక కావడం, ఆఖరుకు అధ్యక్ష స్థానమునుండి బోసు బహిష్కరింపబడటం అనే వ్యవహారము గాంధీజీ ఏ విధంగా కపట వర్తనముతో తన ఇష్టా యిష్టముల ప్రకారం కాంగ్రెసును కట్టుబాటు చేయడమో లేక తిరస్కరించడమో చేస్తూ వుండేవాడో సూచిస్తుంది. కాంగ్రెసు పక్షములో తాను కనీసము నాలుగు అణాల సభ్యుడిని కూడా కాదని, దినితో తనకు ఏలాంటి సంబంధము లేదని 1934 తర్వాత అనేకసార్లు తన విరక్తిని ఆడంబరముగ ఆయన ప్రకటించుకొనినాడు. అయితే సుభాష్ రెండవ మారు ఎప్పుడైతే ఎన్నిక కాబడినాడో అప్పుడు గాంధీజీ తన మానసిక స్థితిలని కోల్పోయి ఆ ఎన్నికలలో ఆయన మొట్టమొదటి నుంచి డాక్టరు పట్టాభికి అనుకులముగ జోక్యము కలిగించుకొనినాడు ఆనుటకు సాక్ష్యము సమకూర్చినాడు. ఒకవైపు ఆ సంస్థలో తాను సభ్యుడినికి కూడా కాదని చెప్పుకొంటూ వున్నా,కాంగ్రెసులోని పోటీలలో కుమ్ములాటలలో ఆయనకు మనస్సునంతా తీవ్రముగా ఆక్రమించే శ్రద్ధ వుండేదని ఇది నిరూపిస్తున్నది.

(మిగతా రేపు)
