26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

(నిన్నటి తరువాయి)

కాంగ్రెసుతో సంబంధము లేకుండా స్వతంత్రముగ వుండిన విప్లవ పక్షమును గురించి ఇంతకు ముందే చెప్పియున్నాను. దీని సానుభూతి పరులలో అనేకులు క్రియాశీలురైన కాంగ్రెసు వారు కూడా వుండినారు. ఈ కాంగ్రెసులోని ఒక పక్షము బ్రిటిష్‌ ఆధిపత్యముతో ఏ మాత్రము రాజీకి ఇష్టపడేవారు కారు. 1914`49 నడుమ మొదటి ప్రపంచ యుద్ధకాలములో కాంగ్రెసు వామపక్షముగ మారుటకు ప్రారంభించింది. కాంగ్రెసులోని వామపక్షమునకు సమాంతరముగ కాంగ్రెసు బయట విప్లవోద్యమము కొనసాగింది. అదే సమయంలో ఐరోపా, అమెరికాలలో అగ్రరాజ్య సహకారముతో భారతదేశములో బ్రిటిష్‌ పాలనను కూలద్రోయుటకు గదర్‌ పార్టీ పనిచేయసాగింది.‘కొనుగటామారు’ సంఘటన అందరికి తెలిసినదే. అదే విధముగ మద్రాసు సముద్రతీరంలో ‘ఎమ్డన్‌’ నానవేసిన బాంబు బారతదేశంలో పెల్లుబుకుచుండిన అసంతృప్తిని గూర్చి జర్మనీ సైనికాధాకిరికి తెలియకుండానే జరిగినదనుటకు వీలులేదు. అంతకు కొద్ది సంవత్సరముల ముందే బ్రిటన్‌కు సైనికసేకరణకు తనకుతానే చురుకుగా ప్రచారము చేసియున్నప్పటికీ 1920 సంవత్సరము తర్వాత గాంధీజీ బలప్రయోగమును నిరుత్సాహపరచి తన కాళ్ళ కింద త్రొక్కివేయబూనినాడు.

భారతదేశములో విప్లవకారుల శక్తిని గురించి రౌలట్‌ నివేదిక చాల దీర్ఘముగ వివరించినది. 1906 నుండి 1918 వరకు ఒకని తర్వాత ఒకడుగ, బ్రిటిష్‌ అధికారులు, వారి తొత్తులు అనేకులు విప్లవవీరులచే కాల్చి చంపబడినారు. బ్రిటిష్‌ అధికారులు ప్రాణములు అరచేతిలో పెట్టుకొని వణికిపోసాగారు. అంతట జరిగినప్పుడు బ్రిటిష్‌ పాలిత రాజ్యమంత్రిగా మాంటెగ్యు ఈ దేశమునకు వచ్చినాడు. బాధ్యతాయుత ప్రభుత్వమును ప్రవేశపెట్టుటకు వాగ్దానము చేసినాడు. అయినప్పటికీ ఆయన కూడా విప్లవకారుల ఉద్ధతి తరంగములను వెనుకకు మళ్ళించుటలో పాక్షికముగ మాత్రమే విజయము సాధించినాడు. రైలట్‌ చట్టమునకు అసమ్మతి ప్రదర్శన చేసిన నేరమునకు వందలాది భారతీయులను జనరల్‌ డయర్‌ కాల్చి చంపించిన జలియన్‌ వాలాబాగ్‌ విషాదోదంత క్రీనిడలలో 1919 భారత ప్రభుత్వ చట్టము మరుగునపడి పోయినది.

రౌలట్‌ చట్టమును ఖండిరచిన వారిపై అత్యంత నిర్లక్ష్యముగాను, ఆపాయకరంముగానూ ప్రతీకారచర్యలు జరిపి సర్‌మైకెల్‌ ఓ డయర్‌ అపఖ్యాతితో ప్రసిద్ధికెక్కినాడు. ఇతడు ఇరవై సంవత్సరములు తర్వాత ఉద్దామ్‌సింగ్‌చే లండనులో కాల్చి చంపబడి తగిన మూల్యమునుచెల్లించినాడు. మహారాష్ట్రలో చాపెకర్‌ సోదరులు, విప్లవకారుల వెన్నెముక శ్యాంజీ కృష్ణవర్మ, లాలాహరదయాళ్‌, వీరేంద్రనాథ ఛటోపాధ్యాయ దాసబిహారీబోస్‌, బాబు అరవింద్‌ఘోష్‌, ఖుధీరాంబోస్‌, ఉల్శాస్కర్‌ దత్తా, మదన్‌లాల్‌ ధింగ్రా, కన్హరే, భగత్‌సింగ్‌, రాజగురు, సుఖ్‌దేవ్‌, చంద్రశేఖర అజాద్‌, విదేశీ పాలనకు భారత యువతమొక్క సజీవదిక్కారము. వారంతా భారత స్వాతంత్య్ర పలాకమును ఎగగట్టి అత్యంత ఉన్నతముగానే వుంచినారు. అందులో కొందరు ఈ పనిని, గాంధీజీ పేరు వినబడుటకు చాలాకాలము ముందు, ఇంకా ఆయన రాజ్యాంగ బద్దమైన ఉద్యమ నాయకుడుగా పరిగణన పొందిన కాలములోనూ చేసినారు.

(మిగతా రేపు)

Related Articles

2 COMMENTS

  1. You are a Good writer అన్నయ్య… కొంచెం కృష్ణుడు, రాధ, లక్ష్మి, నారాయణుల లాంటి దేవీ దేవతల చరిత్రల గురించి వాస్తవాలు తెలుసుకుని రాయండి అన్నయ్య. మీ తోటి వారికి , తరువాతి తరానికి మీరు ఆదర్శం అవుతారు. 🙏😊

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles