26.3 C
Hyderabad
Monday, August 3, 2026
No menu items!

దగ్ధమైన ఈత వనాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు

(బాలే అజయ్ – 9290277727)

కోరుట్ల మండలం సంగెం మరియు కల్లూరు గ్రామాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో విస్తారంగా ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు స్పందిస్తూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అగ్ని ప్రమాదానికి గురైన ఈత వనాలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, స్థానిక నాయకులు ముంజ రాజా గౌడ్, గౌడ సంఘం నేతలతో కలిసి జువ్వాడి కృష్ణారావు సంఘటన స్థలాన్ని సందర్శించారు. దగ్ధమైన ఈత చెట్లను పరిశీలించి బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం వల్ల ఈత వనం పూర్తిగా దగ్ధమవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కొంతం రాజం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల నాయకులు, గౌడ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles