37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

తిరుమల వెంకన్న మాదిరిగా కొందగట్టు అంజన్నను తీర్చిదిద్దుతా; బండి సంజయ్

(తెలంగాణ సామ్న డెస్క్)

తిరుమల దేవస్థానం స్థాయిలో కొండగట్టు అంజనేయస్వామి దేవాలయాన్ని తీర్చిదిద్దుతామని కేంద్ర ీVAంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరినగరం నుండి కొందగట్టుకు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు హామీ ఇచ్చారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి తరపున గెలిచిన వారిని తీసుకొని కొండగట్టుకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న నేపథ్యంలో ఆయన భారీగా పార్టీ కార్యకర్తలతో పాటుగా ఎన్నికల్లో గెలిచిన నాయకలను వెంట తీసుకొని పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం కొండగట్టుకు పవన్‌కళ్యాణ్ భారీగా నిధుల కేటాయించిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రాలో డబుల్ ఇంజన్ సర్కారు వుండడం వల్లనే కొండగట్టుకు నిధులు వచ్చాయని తెలిపారు. కొండగట్టులో ఇంకా కళ్యాణ మండపాలు, గెస్ట్‌హౌజ్‌లు, భోజనశాలతో పాటుగా కనీస వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. కొండగట్టును మరింత గొప్పగా అన్ని విధాలుగా అభివద్ధి చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తాననని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామెల్ హిందు ధర్మాన్ని హేళన చేస్తూ మాట్లాడిన మాటలను తీవ్రంగా విమర్శించారు. సదరు ఎమ్మేల్యేపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. హిందు ధర్మాన్ని అవహేళన చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చప్పట్లు కొడుతు వినోదం చూస్తున్నట్లుగా ప్రవర్తించడం వారి మతద్వేషానికి నిదర్శమని ఆయన విమర్శించారు.

బండిసంజయ్ పాదయాత్రకు వేలాదిగా కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు తరలివచ్చారు. వారికి గ్రామ గ్రామానా ప్రజలు మజ్జిగ, నీరు అందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles