(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పరిధిలోనీ ఓ తోట వద్ద దండ్ల లక్ష్మీ అనే మహిళపై దాడి యత్నం జరిగిందని ఆరోపణలు వెలువడ్డాయి. మాజీ ఎంపీటీసీ గడ్డల శ్రీనివాస్ రెడ్డి మరియు అతని అనుచరులు కర్రలతో తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తనను అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని పేర్కొంది. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
