(నిన్నటి తరువాయి)
- వీర సావర్కరు గృహములోని క్రింది అంతస్థులోని మధ్య హాలులో వుండిన హిందూ సంఘటనోద్యమ కార్యలయమునకు పై దినపత్రి ప్రతినిధులముగా పమేము తరచుగా పోవుచుండడి వారము. ఈ హిందూ సంఘటన కార్యాలమయము వీరసాకర్కరు కార్యదర్శి జి.వి. డెమ్లె మరియు వీర సావర్కరు అంగరక్షకుడు అప్పాకేసర్‌ల ఆధ్వర్యములో నుండెడిది. ముఖ్యముగ వీరసావర్కరు ఇచ్చు పత్రికా ప్రకటనలను శ్రీ డామ్లెనుండి పొందుటకు ఇంకా కార్యదర్శి పత్రికలకు తెలుపుటకు అధికారము పొందిన ఆధ్యక్షుని పర్యటన కార్యక్రమములు, గోష్ఠుల వివరములు, మొదలగు వానిని గురించి తెలసుకొనుటకు మేము ఈ కార్యలమయునకు పోవుచుండెడివారము. ‘‘ఫ్రీ హిందూస్థాన్’’ అనే ఆంగ్ల పత్రికకు సం పాదకుడు శ్రీ ఎ.యస . భిడే తన సంపారముతో అదే క్రింద అంతస్థులోని రరెండు గదులలో బాడుగకు వుండేవాడు. ఒకరికొకరము వ్యక్తిగత స్నేహమును పెంపొందించుకొనిన భిడె, డామ్లె, కేసర్ ఇంకా ఇతర హిందూసభ కార్యకర్తలను, కలుసుకొనుట అనేది, ఆప్టె, నేను, సావర్కరు సదన్‌కు తరచుగా పోవుటకు ఇంకొక వారణము. వారందరిని కలుసుకొని స్నేహపూర్వక ఇష్టాగోష్టి సంభాషణలకూ మేము బొంబాయికి పోయినప్పుడల్లా ఈ కార్యాలయమునకు పోవువారము. ఒక్కొక్కసారి వారితో హిందూ సంఘటన కార్యక్రమమును గూర్తి మాట్లాడేవారము. మా పత్రికలకు వ్యాపార ప్రకటనలు సేకరించుటలో వారు మాకు సహాయము చేసేవారు.
- పైన చెప్పిన కారణముల వలన సావర్కరు సదనమునకు మా రాకపోకలు క్రింది అంతస్థులోని హిందూ సంఘటన కార్యాలయునకు మాత్రమే పరిమితమై యుండిననని ప్రతేత్యకముగా గమనించవలసియున్నది. వీరసావర్కరు మొదటి అంతస్థులో నివసించుచుండెడివారు. ఎప్పుడో చాలా అరుదుగా, అదీ ముందు అనుమతి పొంది వీరసావర్కరుతో గోష్టి జరుపగల్గేవారము.
- సమారు మూడు సంవత్సరములకు ముందు సావర్కరు ఆరోగ్యం తీవ్రముగా భంగమైనది. అప్పటినుండి ఆయన సామాన్యముగ పడక మీదనే వుండవలసి వచ్చినది. ఆ తర్వాత ఆయన తమ బహిరంగ క్యాక్రమములన్నింటిని నిలిపివేసుకొని ఇంచుమించు రాజకీయముల నుండి విరమించినారు. ఆయన పౌరుషవంతమైన నాయకత్వమును, ఆయస్కాంతపు ఆకర్షణ శక్తిని కోల్పోయినందున హిందూ మహాసభ కార్యక్రమములు, పలుకుబడి సన్నగిల్లిపోయినవి. డాక్టర్ శ్యాంప్రసాద ముఖర్జీ అధ్యక్షుడు అయినప్పుడు వాస్తవమునకు హిందూ మహాసభ కాంగ్రెస్ యొక్క పనిమనిషి స్థితికి దిగజారిపోయినది. ఒకవైపు గాంధీప కూటమి, మరియొక వైపు ముస్లింలీగు జరుపు ఆపాయకరమైన హిందూ వ్యతిరేక కార్యక్రమములను ఎదుర్కొని ఎదురుదెబ్బ తీయుటకు అసమర్థమైపోయినది. ఇదంతా గమనించిన నేను, హిందూ మహాసభ చట్టపరిధిలో నడుపబడు హిందూ సంఘటనోద్యమము సఫలమగుటను గూర్చి ఆశలు వదలుకొని దానికి దూరమగుటకు ప్రారంభించినాను. యువశక్తితో కూడిన హిందూవాదలు బృందము నొకదానిని ఏర్పాటు చేసి కాంగ్రెస్, ముస్లింలీగులకు వ్యతిరేకముగ పోరాట కార్యక్రమములను చేపట్టుటకు, మహాసభలోని వృద్ద నాయకులతో సంప్రదించకుండానే నేను నిర్ణయించుకొనినాను.
(తరువాయి బాగం రేపు)
